VUTHPADANA SAMARDYAMTHO JEEVINCHADAM OKA KALA by PALAKURTHI PUSHPALATHA Telugu book cover

VUTHPADANA SAMARDYAMTHO JEEVINCHADAM OKA KALA

by PALAKURTHI PUSHPALATHA

₹50
In stock · 4 available
PublisherPALAKURTHI PUSHPALATHA
LanguageTelugu
అం'తరంగం'.. ఉద్ధరే దాత్మనా? 2 త్మాసమాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనః - భగవద్గీత ఆరవ అధ్యాయము - 5వ శ్లోకం ప్రతివ్యక్తి తనను తానే ఉద్ధరించుకోవలసి ఉంటుంది... తనకు తానుగా అధోగతి పాలవడం మంచిది కాదు... తనకు తానే బంధువు తానే తనకు శత్రువు... అంటుంది గీత.. ఎవరైనా ప్రగతి సాధించాలి... అంటే.... గురువులు.. ఆత్మీయులు మార్గం చూపుతారు.. విజయ సాధకుల అనుభవాలు పుస్తక రూపంలో ప్రేరణనిస్తాయి... విషయాన్ని శ్రద్ధగా తెలుసుకొని తానెన్ను కున్న మార్గంలో... నిరంతర తపనతో ముందుకు సాగి విజయం సాధించడం.. మానవుని కర్తవ్యంగా గీతాచార్యులు ప్రబోధిస్తున్నాడు.. God helps those who helps themselves. సోమరులు... బద్ధకస్తులు సాధించగలిగినదేదీ లేదు... భగవంతుడు కూడా వారికి సహాయపడడు.. సాధారణంగా మనిషిని Human being అంటుంటారు... కాని Manis ... not a being... man is a becoming, he is a Process (Osho). పశు, పక్ష్యాదులు, చెట్టు, చేమలు.... వీటిని Beings అంటాం... వాటి స్థాయి ఎన్నడూ మారదు.. కాని మనిషి తన స్థాయిని మార్చుకోగలడు.... ఉన్నతంగా ఎదిగి దేవతల స్థాయిని అధిగమించగలడు... లేదా పశు పక్ష్యాదులు.. చెట్టు చేమల స్థాయి కన్నా అధమ స్థాయికి దిగజారనూగలడు... ఏ స్థాయికి చేరుతాడో అది అతని విజ్ఞత..... Humans can create their own environment.... where as animals adopt to their environment అనేది అనుభవ సత్యం.... ఒక పెద్దపులి మంచిపులిగా