VYAKTITVA VIKASANIKI HITOTHULU by DR.RAJURU RAMAKRISHNA REDDY Telugu book cover

VYAKTITVA VIKASANIKI HITOTHULU

by DR.RAJURU RAMAKRISHNA REDDY

₹80
In stock · 350 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట తరతరాలుగా మానవాళిని ఉత్తేజితం చేసే ధర్మాలు,సత్యాలు, చేతులు ఎన్నో మణిమయ నిక్షేపాలుగా పొదిగి ఉన్నాయి. జ్ఞాన బంగారాన్ని అకుంఠిత తపస్సుతో పొందిన మహనీయుల హితోక్తులు మానవాళినీ సరైన పంథాలో నడిపేందుకు తోడ్పడుతాయి. “మహాజనో -నగతః స పంథా” అన్నారు. మహాత్ములు నడిచిన మార్గం, చెప్పిన వోక్తులు అందరికీ అనుసరణీయం. నాటి పురాణ కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మహనీయులు మానవుణ్ని మాధవుడిగా వుంచేందుకే శ్రమించారు. సమాజంలో మంచిని పెంచేందుకు, యువతలో సత్ప్రవర్తన కలిగేందుకు మహాత్ముల హితోక్తులను సందర్భానుసారంగా వాడటం మేలని గుర్తించాలి. మహాత్ముల పలుకులు వరమందికి ఉపయుక్తం కావాలి. కొండంత అనుభవాన్నీ, విజ్ఞానాన్ని గోరంత ప్రమాణంలో ఉ సూక్తులు, హితోక్తులు తమలో ఇముడ్చుకుంటాయి. ఒక చిన్న చిత్తనం మహావృక్షమై, ఫలాలను అందించినట్లే, సూక్తులు గోచరిస్తాయి. సుభాషితాలకు, హితవాక్యాలకు ఉన్న శక్తి దేనికీ ఉండదు. అవి సూక్ష్మ రూపంలో ఉన్నా, అజ్ఞానాన్ని పారద్రోలి, అనుభవాన్ని పండించుకోవడానికి ఉపకరిస్తాయి. ఈ హితవాక్యాలను హృదయంలో పదిలపరచుకున్నవారు సర్వశక్తి సంపన్నులవుతారు. హితవాక్యాలు చాలా మందికి నచ్చవు. పొగడ్తలు నచ్చుతాయి. ఔషథం చేదుగా ఉన్నా రోగాన్ని దూరంచేసి, ఆరోగ్యవంతునిగా చేస్తుంది. హితం చెప్పేవారు మాటికో కోటికో ఉంటారు. సత్యంలా హితోక్తులు తెలిసినట్టు అనిపించినా, ఎవరికీ పూర్తిగా తెలియవు. జ్ఞానులు మాత్రమే సూక్ష్మసత్య