VYAKTITVAME KAVITVAM by MALUPU BOOKS Telugu book cover

VYAKTITVAME KAVITVAM

by MALUPU BOOKS

₹100
In stock · 21 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076176
'There are decades where nothing happens and there are weeks where decades happen' అంటాడు వ్లాదిమిర్ ఇలీయిచ్ లెనిన్. వరవరరావు జీవితంలో మాత్రం ఏ రోజూ, ఏ వారమూ, ఏ దశాబ్దమూ, ఏమీ జరగకుండా, ఏదీ సంభవించకుండా పోలేదనిపిస్తుంది. ఆకలి తప్ప అన్యం తెలియని రెండేళ్ళ పసితనంలోనే చుక్క చుక్క పాలు పీల్చుతూ, ‘నా రక్తం తాగుతున్నావు కదరా' అని బలహీనురాలయి తల్లిచేత, నిస్సహాయమైన విదిలింపులకి గురి అయిన అనుభవాలతో సహా వరవరరావు జీవన మార్గం యావత్తూ, ఈ అరవై యేళ్ళలో నానా రకాల అనుభవాలతో, ఎగుడు దిగుళ్ళతో, అతి స్వల్ప సంతృప్తులతో, సుదీర్ఘ సంఘర్షణలతో, పోరాటాలతో, ప్రతిఘటనలతో, ఆకాంక్షలతో, చెదరని ఆశయాలతో, తొణకని స్వప్నాలతో నిర్మాణమయింది. వరవరరావుని నేనొక epoch maker గా భావిస్తాను. ఆయన కవిత్వం, ఆయన రాజకీయాలు నాకెప్పుడూ వేరువేరుగా కనిపించలేదు. సుమారు 2000 పుటలలో నిక్షిప్తమై ఉన్న వివి కవిత్వానికి ఈ నక్షత్ర సముదాయంలో ఒక సముజ్వల స్థానం ఇప్పటికే స్థిరపడి ఉండాలి. దానిని పైకి లేపి పట్టి, ఆ ధగద్ధగలని ప్రపంచానికి చూపించే ప్రయత్నం పాణి ప్రారంభించాడని అనుకుంటున్నాను.