VYAKTULU VYAKTHITWALU by KANCHI VASUDEVA RAO Telugu book cover

VYAKTULU VYAKTHITWALU

by KANCHI VASUDEVA RAO

₹55
In stock · 213 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆంధ్రప్రదేశ్ అవతరణకు అవరోధాలను తొలగించిన రాజనీతి విజ్ఞుడు బూర్గుల 1953 అక్టోబరు 1వ తేదీన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఆంధ్రుల చిరకాల వాంఛితమయిన ఆంధ్రరాష్ట్రం కర్నూలు రాజధానిగా అవతరించింది. కాని ఆంధ్రుల తుది ధ్యేయం హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణాగా ప్రసిద్ధమయిన తెలుగు ప్రాంతం, మద్రాసు, మైసూరు రాష్ట్రాలలోని తెలుగు ప్రాంతాలతో కూడిన విశాలాంధ్ర. ఆంధ్రరాష్ట్ర అవతరణలో విశాలాంధ్ర లక్ష్యం చేరువయినా, ఆనాటి ప్రముఖ తెలంగాణా నాయకుల తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆ లక్ష్య సాధనలో అవరోధాలు ఏర్పడ్డాయి. నూకల నరోత్తమరెడ్డి సంపాదకత్వంలో గోల్కొండ పత్రిక ప్రత్యేక తెలంగాణా కోసం నిర్విరామ ఉద్యమాన్ని నిర్వహించింది. స్వర్గీయ కొండా వెంకటరంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి. జె.వి. నరసింగరావు వంటి ప్రముఖ తెలంగాణా నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడానికి ఏమాత్రం సుముఖంగా లేరు. అప్పుడు తొమ్మిది తెలంగాణా జిల్లాలతో, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. ఆ విధంగా విశాలాంధ్ర లక్ష్యసాధనకు తీవ్రమైన అవరోధం ఏర్పడిన సమయంలో ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు, స్వామి రామానందతీర్థల చొరవ, పట్టుదల వలన ఈ అవరోధాలు తొలగిపోయాయి. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు, కన్నడ, మహారాష్ట్ర భాషలు మాట్లాడే ప్రాంతాలు వుండేవి. ఒకవిధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం త్రివేణీ సంగమం. రాష్ట్ర పునర్