VYASA BHOOMI by DR.C.BHAVANIDEVI Telugu book cover

VYASA BHOOMI

by DR.C.BHAVANIDEVI

₹200
In stock · 16 available
PublisherHIMABINDU PUBLICATIONS
LanguageTelugu
ఈ వ్యాసాల గురించి "ముఖే ముఖే సరస్వతీ!" ప్రతి సాహితీవేత్తను చదువుతున్నప్పుడు వారి వారి బహుముఖీన ప్రతిభా వ్యుత్పత్తులు ఆశ్చర్యపరుస్తాయి. వారి ప్రజ్ఞా ప్రాభవాన్నీ సాహితీ చైతన్యయాత్రలోని అవిరళకృషినీ సందర్శించినపుడు నిత్యసాహిత్య విద్యార్థిగా స్పందించటం జరుగుతుంది. హేతువు, బుద్ధి, సృజనాత్మకతలు అభివ్యక్తిలో మేళవించుకున్న ముంగిటి ముత్యాలగురించి ప్రముఖ మహనీయ మానవతామూర్తుల గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ఆ అధ్యయనమే ఈ "వ్యాసభూమి”. గత నలభై ఐదేళ్ళుగా తెలుగు సాహితీరంగంలో వివిధ సాహితీ ప్రక్రియల్లో నా కలం ప్రస్థానంలో ఆయా సందర్భాల ననుసరించి రాసిన వ్యాసాలివి. వివిధ పత్రికల్లో, ప్రత్యేకసంచికల్లో ప్రచురితాలు, సాహితీ సదస్సుల్లో సమర్పించిన పరిశోధనా పత్రాలు. కొన్ని సాహిత్యానికి సంబంధించినవైతే కొన్ని సామాజికం, మరికొన్ని ఆధ్యాత్మికం, కొందరు ప్రముఖుల జీవన విశేషాలు ఉన్నాయి. ప్రతివ్యాసం ఆయా ఆధారిత గ్రంథాలు, వ్యాసాలు పరిశీలించి రాసినవి. ఆయా కాలాలలో విజ్ఞులైన పాఠక శ్రోతల ఆదరణ పొందినవి. ఇది నా మూడవ వ్యాససంపుటి. సాహితీలోకం ఎప్పటిలాగే ఈ అక్షర కృతిని ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ వ్యాసాలు ప్రచురించిన పత్రికాధిపతులకు, ఎలక్ట్రానిక్, ప్రింటు మీడియావార్కి 'రంజని' సంస్థకూ కృతజ్ఞతలు. ఆర్థిక సౌజన్యాన్నందించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారికీ, ప్రచురణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు.