VYASA KALPAKAM by S.SARATH JYOTHSNA RANI Telugu book cover

VYASA KALPAKAM

by S.SARATH JYOTHSNA RANI

₹100
In stock · 48 available
PublisherS.SARATH JYOTHSNA RANI
LanguageTelugu
సార్థక ప్రయత్నం చదువుకోవడానికి వచ్చే వారికి విద్యాలయాలు ఏమి ఇవ్వాలి? పరిజ్ఞానం ఇవ్వాలి. అవగాహన ఇవ్వాలి. బడిలో చెప్పినదాన్ని ఆసరా చేసుకొని మరింత లోతుకు వెళ్ళి చదివే అభిరుచినీ ఇవ్వాలి. వీటితోపాటు, కొన్ని నైపుణ్యాలనూ ఇవ్వాలి. శాస్త్ర సాంకేతిక విద్యలలో జ్ఞానమూ అవగాహనా ఏ మాత్రం ఇస్తున్నారో తెలియదు కారీ, నైపుణ్యాలనూ అందించే ప్రయత్నం బాగానే చేస్తున్నారు. మానవీయ శాస్త్రాలలో నుంచి అవగాహన అందించే సంస్థలు సైతం నైపుణ్యాలను ఏమాత్రం అందించ గలుగుతున్నారో సందేహమే. స్కూలు ఫైనల్, ఇంటర్ మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఏదో ఒక భాషలో సొంతంగా ఒక వాక్యం రాయడం కూడా రావడం లేదు. పాఠ్యపుస్తకాలను దాటి సొంతంగా పుస్తకాలు, పత్రికలు చదివే అభిరుచీ ఏర్పడడం లేదు. పట్టభద్రులకు, స్నాతకోత్తర విద్యార్థులకు కంప్యూటర్ను జ్ఞాన సాధనంగానే కాదు, డేటా ప్రాసెసింగ్ సాధనంగా ఉపయోగించడమూ రావడం లేదు. భాషా సాహిత్య విద్యార్థులలో, విమర్శ, విశ్లేషణ చేయగలగడం, ప్రమాణాలకు అనుగుణంగా వ్యాసరచన చేయగలగడం అరుదుగా మాత్రమే కనిపిస్తున్న నైపుణ్యాలు. పరిశోధన చేసి పట్టాలు పొందే పండిత విద్యార్థులలో కూడా, అనంతర జీవితంలో తాము నేర్చుకున్నదానిని కొనసాగించి, సమాజానికి మరింతగా ఉపయోగపడేవారు తక్కువే. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు చెందిన పరిశోధక విద్యార్థులు రాసిన వ్యాసాలతో కూడిన ఈ సంకలనాన్ని చూసినప్పుడు, విద్యాలయాల పై విద్యార్థులపై ఉన్న సాధారణ నిరసనకు అపవాదాలు ఉన్నాయని అనిపిస్తుంది. వివిధ అంశాలు తీసుకొని విద్యార్థులు విశ్లేషించిన పద్ధతి, తమ ప్రతిపాదనలను ఒక క్రమంలో వివరించిన తీరు భవిష్యత్తుపై ఎంతో ఆశ కలిగిస్తున్నాయి.