VYASA MAHABHARATHAM by SAMBAIAH CHEEMAKURTHY Telugu book cover

VYASA MAHABHARATHAM

by SAMBAIAH CHEEMAKURTHY

₹180
In stock · 20 available
PublisherSAMBAIAH CHEEMAKURTHY
LanguageTelugu
ముందుమాట వ్యాస మహాభారతం మన జాతీయ గ్రంథం. భారతంలో లేనిది ప్రపంచంలో లేదు. ధర్మం, అర్ధం, కామం, మోక్షం, అనే నాలుగు పురుషార్థాలు సాధించటానికి అవసరమయ్యే జ్ఞానం అంతా అందులో ఇమడ్చబడింది. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారమంతా అందులో ఇమడ్చబడింది. అందువలన మహా భారతం 'పంచమ వేదం'గా భారతీయ విజ్ఞాన సర్వస్వంగా ప్రశస్తి పొందింది. శ్రీ వ్యాస మహర్షి వేదాలను విభజించారు. వేదాలు మంత్ర రూపంలో ఉన్నాయి. అవి అందరికి అర్ధం అవటం కష్టం. అవి జ్ఞాన రూపంలో వున్నందున ఎల్లరకు అర్థంకావటానికి కథా రూపంలో భారతాన్ని ప్రపంచానికి అందించారు. అందువలన భారతాన్ని అనువదిస్తూ, కవి నన్నయ ఇలా అన్నాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని యద్రాత్మోవిదులు వేదాంతమనియు నీతి విచక్షుణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహా కావ్యమనియు లాక్షిణుకుల్ సర్వ లక్ష్య సంగ్రహమని యైతి హాసికులు ఇతిహాసమనియు బరమ పౌరాణికుల్ బహు పురాణసముచ్చయంబని మహిగొనియాడుచుండ వివిధ వేదతత్వవేది వేదవ్యాసు దాదిముని పరశరాత్మజుండు విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ జేసే భారతంబు. పై పద్యంలో నన్నయ భారత విశ్రుతత్వాన్ని వర్ణించాడు. కురుక్షేత్ర యుద్ధం మహా భారతంలో ముఖ్యమైన ఘట్టం. అందులో వ్యాసముని పై తత్వాన్నంతా ఇమిడ్చారు. దండలో దారంలాగా, దండకనపడుతుంది గాని దారం కనపడదు గదా! ఆలోగా వ్యాసుడు కథను కథగా నడుపుతూ, పైన చెప్పిన లక్షణాలన్నీ కథల రూపంలో, నారద మహర్షి, మార్కండేయుడు మొదలగు ఋషులచేత చెప్పించాడు. ఆది,సభా, అరణ్య పర్వాలలో వున్న కథలను, మూల కథలోకి వెళ్లకుండా శ్రీ సాంబయ్యగారు స్రోతలకి అందజేయదలచి ఈ పుస్తకాన్ని రూపొందించారు.