
VYASA MAKARANDAM
₹100
In stock · 32 available
PublisherS.SARATH JYOTHSNA RANI
LanguageTelugu
మీతో ఒక మాట జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని కవులపై, వివిధ ప్రక్రియలపై పత్ర సమర్పణ చేశాను. నేను ఎన్నో పుస్తకాలు రాశాను. పుస్తకాలన్నింటికి ప్రముఖ సాహితీవేత్తలు విమర్శకులు ముందుమాటలు రాశారు. ఒక సాహితీవేత్తగా, విమర్శకురాలిగా, రచయిత్రిగా ప్రసిద్ధి పొందిన నేను ఈ కొత్త పుస్తకం “వ్యాసమకరందం" కు ముందుమాట రాసుకుంటున్నాను. ఈ వ్యాస సంకలనంలో 20 వ్యాసాలున్నాయి. అవి వేటికవే విలక్షణమైనవి. వీటిని జాతీయ, అంతర్జాతీయ సాహితీ సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణ చేశాను. వాటిని ఒక వ్యాస సంకలనంగా తీసుకువస్తున్నాను. ఈ వ్యాస మకరందాన్ని నా మనుమళ్ళు చిరంజీవి చేతన్ కృష్ణకు, చిరంజీవి సోమనాథ్ కార్తికేయకి అంకితం చేస్తున్నాను. ఈ వ్యాసమకరందం ఎం.ఏ. చదివే తెలుగు విద్యార్థులకు, సాహితీ అభిమానులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యాసమకరందాన్ని ప్రూఫ్ చూడడంలో సహకరించిన డా॥ అనిల్కుమార్ గార్కి, చి॥ లింగరాజుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకానికి ముఖచిత్రం అందించిన ఆర్టిస్ట్ జి. అమరేశ్వరరావుగారికి, టైపింగ్ నిర్వహించిన ఆనంద్ గారికి, అందంగా లే అవుట్ చేసిన చి॥ షకీల్ అహ్మద్గారికి నా ధన్యవాదాలు. అలాగే అందంగా ప్రింట్ చేసిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాద్వారికి, ప్రచురిస్తున్న పబ్లిషర్ శ్రీ వి.వి. రమణగారికి కృతజ్ఞతలు.