VYASA VAIJAYANTHI by DR.M.MALLIKARJUNA REDDY Telugu book cover

VYASA VAIJAYANTHI

by DR.M.MALLIKARJUNA REDDY

₹125
In stock · 2 available
PublisherDR.M.MALLIKARJUNA REDDY
LanguageTelugu
వినయాంజలి ఒకప్పుడు కవిత్వాన్ని అభిమానించి, గౌరవించి, ఆదరించి, ఆరాధించే వారు. కవితకు బ్రహ్మరథంపట్టిన రోజులున్నాయి. ప్రస్తుతకాలంలో వ్యాసాలకు అటువంటి గౌరవం లభిస్తున్నది. వ్యాసానికొక సౌలభ్యముంది. వ్యాస రచయిత ఈ చరాచర ప్రపంచంలో ఏ వస్తువునైనా స్వీకరించవచ్చును. ఆ వస్తువు రచయిత అభిరుచి అనుభూతులకు సంబంధించిందిగా ఉంటుంది. తనకిష్టమైన వస్తువు లభ్యమైనందువల్ల రచయిత దాన్ని విశ్లేషించడంలో కూడా న్యాయం చేస్తాడు. మనకు తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నా వ్యాసానికున్న సానుకూలత మరే ప్రక్రియకు లేదు. ఎంత క్లిష్టమైన అంశాన్ని కూడా వ్యాసంలో తేలిగ్గా చెప్పగలిగే సౌకర్యముంది. రచయిత యొక్క ప్రతిభా సామర్థ్యాలు, ఓర్పు, నేర్పు అన్ని తన వ్యాసంలో వెల్లడిస్తాడు. రచయిత గ్రహించిన వస్తువును సంక్షిప్తంగా, సమగ్రంగా రూపొందించుకొని రచన చేయాలి. ఎందుకంటే వ్యాసమనేది సుదీర్ఘంగా లేకుండా సంక్షిప్తంగా వుంటే మంచిది. మినీ, హైకూ, నానీ కవితల్లాంటి ఆధునిక ప్రక్రియలు బాగా వ్యాప్తిలో ఉన్న ఈ రోజుల్లో చిన్న వ్యాసాలకే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. వ్యాసాలు సైజులో చిన్నవైనా రచనలో శ్రేష్ఠంగా ఉండాలి. తాను చెప్పదలచు కొన్న విషయాన్ని చిన్నచిన్న వాక్యాలలో అందరికీ అర్థమయ్యే వాడుకభాషలో చెబితే ఆ వ్యాసం కూడా మనోహరమై ఒప్పారుతుంది. దాదాపు దశాబ్దంపై చిలుకు కాలంలో అప్పుడప్పుడు నేను రాసిన నలభై సంస్కృతి, సాహిత్య, ఆధ్యాత్మిక వ్యాస సంపుటే ఈ వ్యాస వైజయంతి. ఈ వ్యాసాలన్నీ వాఙ్మయి, మూసీ, సాహిత్య నేత్రం, భావవీణ, రసమయి, వెలుగు మొదలైన సాహిత్యమాస, త్రైమాసిక పత్రికల్లోను, భక్తి, ఋషిపీఠం, గురుప్రియ, శ్రీశైలప్రభ, కాలజ్ఞానసుధ, పుష్పగిరి భారతి మొదలైన ఆధ్యాత్మిక పత్రికల్లోను ప్రచురింపబడినవి. మరికొన్ని ప్రత్యేక సంచికల్లో ప్రచురింపబడగా, జాతీయ సదస్సుల్లో సమర్పించిన వ్యాసాలున్నాయి. ఆకాశవాణి కడప కేంద్రంనుండి ప్రసారమైన ప్రసంగాలు కూడా ఈ వ్యాస సంకలనంలో చోటుచేసుకొన్నాయి.