
VYASAMURALI - 60
₹60
In stock · 38 available
PublisherAMUDALA MURALI
LanguageTelugu
పిలిచిన మురళికి.... పలికిన పద్యం... వాగ్దేవీతత్త్వానికి, కవి ఒక పక్షం, సహృదయుడు మరొక పక్షం. ఇవి రెండూ పరస్పర ఉపకారకాలు. కవి అనేపక్షం లేకపోతే సహృదయు డనే పక్షం లేదు, సహృదయు డనే పక్షంలేకపోతే కవి అనే పక్షం ప్రయోజనశూన్య మౌతుంది. అంచేత, ఇవి అన్యోన్య పూరకాలు ఏమైనా వాగ్దేవీతత్త్వంమాత్రం ఒకటే. ఆముదాల మురళి రచించిన ఈపదకొండువ్యాసాలసంకలనం సారస్వతతత్త్వరూప మైంది. పరమేశ్వరుడు తన స్వీయ శక్తిసాహాయ్యంతో జగత్సృష్టి చేస్తున్నట్లే కవి సహజప్రతిభా సాహాయ్యంతో కావ్యసృష్టి చేస్తున్నాడు. ఈ ప్రతిభను "కారయిత్రీ ప్రతిభా”, “భావయిత్రీ ప్రతిభా" అని రాజశేఖరుడు రెండువిధాలుగా విభజించాడు. కావ్యం రచింపచేసేప్రతిభ "కారయిత్రి", దానిలోని సౌందర్యాన్ని ఆస్వాదింపచేసేప్రతిభ 'భావయిత్రి', కారయిత్రి అధికంగా ఉన్నవాడు సత్కవిఐతే భావయిత్రి పాలు అధికంగా ఉన్నవాడు మంచిభావుకుడు, కావ్యసౌందర్యాస్వాదనచతురుడూ అవుతాడు. సద్విమర్శకు డవుతాడు. భావయితృప్రతిభ, కారయితృప్రతిభకు ఏ మాత్రమూ తీసిపోదు. ఈ ప్రతిభతో పాటు బహుగ్రంథ పరిచయంకూడా విమర్శకునికి అవశ్యకం. అది లేని వాళ్లు చేసేవిమర్శ పాక్షికంగా ఉండిపోతుంది. 'ఆముదాలలో' సద్విమర్శకుని కుండవలసిన యోగ్యత పుష్కలంగా ఉన్నట్లు ఈ వ్యాసాలు చాటి చెపుతున్నాయి. 'అవధానకళానిధి' ఆముదాలమురళి-అవధానవిద్యతో పాటు, పద్యరచనలూ, అనువాదాలూ, వ్యాసాలు రచిస్తూ - విద్యాదేవతానుగ్రహానికి పాత్రుడై-అందరి ఆదరాభి మానాలు చూరగొన్నాడు. వినయవిధేయతలు ఇతని ఆస్తి, పద్యరచనే ప్రాణం. పద్యం, గద్యం- ఇతనికి రైలు పట్టాలు. రెండూ ఎంతదూరమైనా సమాంతరంగా పయనిస్తాయి. సంస్కృతాంధ్రాలలో నిరంతరపరిశ్రమి ప్రాచీనసాహిత్యాన్ని ఇతని 'మురళి' సుమధురంగా ధ్వనిస్తుంది. ఛందస్సు ఇతనికి హృదయం. భాషలో ప్రౌఢత్వంతోపాటు