
VYAVASAYA VIGNANA PADAKOSAMU
₹250
In stock · 13 available
PublisherG.MURALI KRISHNA
LanguageTelugu
పీఠిక మైత్రీభావనతో కూడినట్టి దృష్టితో ప్రపంచాన్ని చూడుము (వేదం చెప్పింది) భారతదేశం వ్యావసాయక దేశము. మనదేశంలో దాదాపు 60-70 శాతం ప్రజలు గ్రామసీమల్లో నివసిస్తూ వ్యవసాయం పశుపోషణ తదితర వ్యవసాయ అనుబంధ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. మన ఆర్థిక రంగానికి వ్యవసాయం మూలాధారమైనప్పటికీ నైపుణ్యం గల మానవ వనరులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానమును పూర్తిగా వినియోగించుకొనుట లేదు. ఈ విషయంలో బాగా వెనుకబడి ఉన్నాము. వ్యవసాయరంగంలో, ఉన్నత స్థానంలో ఉన్న వ్యవసాయ విద్యావంతులు పైస్థాయిలో ఉండు వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులు, సాంకేతిక శాస్త్రవేత్తలు, విషయ విజ్ఞాన నిపుణులకు ఉత్తమ సాహిత్యం ఇంగ్లీషులో అందుబాటులో ఉంది. గ్రామస్థాయి వ్యవసాయ విస్తరణాధికారులకు అభ్యుదయ కర్షకులకు అందుబాటులో లేదు. జనాభా పెరుగుదలకు తగినట్లు ఉత్పత్తి జరుగుట లేదు. కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఉంది. డిమాండుకు తగ్గ ఉత్పత్తి సాధనకు వ్యవసాయంలో శిక్షణ పొందిన వృత్తి నిపుణుల అవసరం ఎంతో ఉంది. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకొనే అవసరం ఎంతో ఉంది. అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః భగవద్గీత 3-14 ప్రాణులన్నీ అన్నము నుండే జన్మించును- అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును యజ్ఞము వలన వర్షము కురియును. మనిషి మనుగడకు ముఖ్యమైనవి తిండి- గూడు గుడ్డ వీనిలో మొదటిది తిండి. ఆహార ధాన్యాలను పండించువాడు రైతు. వ్యవసాయం చాల ముఖ్యమైనది. 'సానోభూమిః వర్ధయత్ వర్ధమానా', వ్యవసాయము చేతనే పృధ్వి సర్వ సంపదలను మనకు ప్రసాదిస్తుంది. వేదం చెప్పింది.