VYUHAM - ATMAKURU RAMANADAM by ATMAKURU RAMANADAM Telugu book cover

VYUHAM - ATMAKURU RAMANADAM

by ATMAKURU RAMANADAM

₹200
In stock · 243 available
PublisherATMAKURU RAMANADAM
LanguageTelugu
వ్యూహం ఆత్మకూరు రామనాదం 18-12-2014 గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారికి ఆత్మకూరు రామనాదం నమస్కారములు. 11.12.2014 తారీఖు పేపరులో రైతు రుణ విముక్తి పత్రం విడుదల ప్రకటనలో రాజముద్ర మధ్యలో పూర్ణకుంభం సరిగా లేదు. గత ఉత్తరంలో పూర్ణకుంభం ఎలా ఉండాలో బొమ్మగీచి పంపించినాను ఇప్పుడు పేపరులో ఉన్న పూర్ణకుంభం కింద అశోకచక్రం లేదు. పూర్ణకుంభం మీద దంతధావనం చేసే పుల్లలు నిలువుగా పేర్చినట్లున్నది. పూర్ణకుంభం అనగా అన్నంతో నిండిన కుండ అని అర్థం కుండపై అన్నం పొంగుతున్నట్లుగా మెతుకులు పక్కకు జాలువారినట్లుగా ఉండాలి. మన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పాడి పంటలతో సశ్యశ్యామలముతో ప్రసిద్ధి గాంచినదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిహ్నం పూర్ణకుంభం నిర్ణయించినారు ఈతరం వారికి చాలామందికి మన రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభమని తెలియదు పూర్ణకుంభం కింద అశోకచక్రం. అశోకచక్రం కింద సత్యమేవజయతే తప్పకుండా ఉండాలి. మన కరెన్సీ అన్ని నోట్ల మీద అశోకచక్రం సత్యమేవజయతే అని వుంటుంది. కె.సి.ఆర్. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో అశోకచక్రం లేకుండా నిర్ణయించినాడని ఒక లాయరు హైకోర్టులో పిటీషను వేసినాడు. తరువాత చిహ్నంలో అశోకచక్రం చేర్చినారు. 2014 సంవత్సరం డిశంబరు 11వ తారీఖు పేపరులో చదువుకు విదేశీకళ అనే హెడ్డింగులో విషయాలు చదివినాను అన్నీ విషయాలు మంచివే కానీ ఆఖరున ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో నైతిక విలువల విద్యా ప్రాధాన్యాన్ని ఏడవతరగతి నుండే ప్రవేశపెట్టాలని సి.యం. పేర్కొన్నారని చదివినాను నైతిక విలువల విద్య బోధించడానికి ఉపాధ్యాయులకు నైతిక విలువలు తెలుసా? అందరికి కాదు మంచి చెడు అందరిలో అన్నీ విషయాలలో ఉంటాయి. మోజార్టి వారిని చూడాలి ప్రాథమిక విద్య కాని ఉన్నత విద్య కాని ఎందులోనయినా ఉపాధ్యాయులకు నైతిక విలువలు కాని బాధ్యతలు కానీ