WALLPAPER KATHALU by VIVINA MURTHY Telugu book cover

WALLPAPER KATHALU

by VIVINA MURTHY

₹45
In stock · 13 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
వస్తువులోనూ, ఆలోచనలోనూ నవ్యత, కథనంలో ప్రత్యేకత - ఈ కథల్లో దేన్ని స్పృశించినా స్పష్టంగా కనిపించే లక్షణాలు. వస్తు స్వీకారంలోనూ, కథా నిర్మాణంలోనూ, పాత్రల అంతరంగాల విశ్లేషణలోనూ రచయిత కేవలం కొత్తదనాన్ని మాత్రమే కాక అత్యాధునికతను ప్రవేశపెట్టిన కథలివి. సంఘటన కన్నా మనస్తత్వ చిత్రణ ప్రధానంగా సాగిన ఈ కథల్లో సంఘటన వెనక హృదయాన్ని, ఆ హృదయం లోతుల్లోంచి బయట పడలేకపోయిన ప్రకంపనల్ని ఒడుపుగా నమోదు చేసిన ప్రతిభావంతమైన బౌద్ధిక రచనలు ఈ కథలు. కొత్త సాంకేతిక పద విన్యాసం, కొత్త మానసిక విశ్లేషణా పద్ధతి, అభివ్యక్తిలో కొత్త మార్గానుసరణ, ఆలోచనలో ముందు చూపు, దృక్పథంలో ప్రగతి శీలత వీటన్నిటి మేళవింపుతో వెలువడిన వివిన మూర్తి గారి ఈ కథలు సామాన్య పాఠకుల కాలక్షేపానికి కాక బుద్ధిజీవుల అంతరంగాలను స్పృశించడానికి, ఆలోచనా తరంగాలను వారి మనస్సుల్లో రేకెత్తించడానికి ఉద్దేశించబడ్డాయి. - శీలా వీర్రాజు