WEAK POINT by M.V.R.SASTRY Telugu book cover

WEAK POINT

by M.V.R.SASTRY

₹150
In stock · 5 available
PublisherDURGA PUBLICATIONS
LanguageTelugu
'కష్టేఫలే' అన్నారు పెద్దలు. ఎంత కష్టపడితే అంత ఫలం ఉంటుందని వారి ఉద్దేశం. కాని... ఒక్కోసారి తక్కువ కష్టపడితే ఎక్కువ ఫలం దక్కటమూకద్దు. 'వీక్పాయింటే' అందుకు ఉదాహ రణ. నేనుచేసే రచనల్లో అన్నిటికంటే తక్కువ కష్టపడేది 'వీక్పాయింట్కే. పడే శ్రమతో పోలిస్తే ఎక్కువ పేరు వచ్చిందీ దానికే! ఉన్నమాట'లో వివిధ సమకాలిక విషయాలమీద వ్యాసాలూ, వ్యాసపరంపరలు రాసేప్పుడు విషయసేకరణకోసం, నేపథ్య సమాచారం కోసం, ఒక అంశాన్ని ధ్రువీకరించుకోవడంకోసం, ఒక వాదానికి కావలసిన నిర్ధారణలను, నిరూపణలను వెతికి, మదించి, కావలసిన రీతిలో మలచుకో వటం కోసం ఒక్కోసారి రోజుల తరబడి, వారాల తరబడి కష్టపడవలసి వచ్చింది. చరిత్రకు సంబంధించిన రచనల్లోనైతే మరీనూ. ఎప్పుడైనా సంపాదకీయం రాసేప్పుడూ మూడు పేరాల కోసం ముప్పై ఘడియలు ఆలోచించి, ముఫ్పైమూడు పత్రాలనో, పుస్తకాలనో తిరగేసిన సంద ర్బాలూ ఉన్నాయి. వీటితో పోల్చితే 'వీర్పాయింట్' కోసం నేను పడే శ్రమ చాలా తక్కువ. 'కాలమ్' మీద శ్రద్ధ లేక కాదు. బద్దకం వల్లా కాదు. ఈ శీర్షిక తరహాయే అంత. సమాచారాన్ని దట్టించి, సమస్య అన్ని కోణాలనూ తడిమి, ఆయా విషయాలను వీలైనంత సమగ్రంగా చర్చిం దానికి దీన్ని ఉద్దేశించలేదు. ఆ వారంలో అందరి దృష్టినీ ఆకర్షించిన లేక ఆకర్షించి ఉండవలసిన ఒకటీ అరా (ఔను. నిజంగానే 'అర' విషయాన్ని తీసుకుని, ఒక్క పేరా అయినా నడుస్తుందో లేదో ననుకుంటూ డెడ్లైనుకు గంటముందు మొదలుపెట్టి, దానితోనే కాలమ్ నింపిన సందర్భాలూ ఉన్నాయి.) అంశాలను తీసుకుని, వాటిలో చాలామంది గమనించని వింతకోణాన్నో. విచిత్ర వైరు ధ్యాన్నో, తమాషా విషయాన్నో వ్యంగ్యంగా చిత్రించేదే 'వీఠ్్పయింటు'. కాబట్టి గహనమైన అధ్య యనం దీనికి అవసరం లేదు. ఎంత తేలికగా ఎంత అలవోకగా చెబితే అంత మంచిది. 'ఆంధ్రభూమి'కి నేను సంపాదకుడినైన కొత్తలో మా సంస్థనుంచే వెలువడే 'డక్కన్ క్రానికల్' లో ప్రతి ఆదివారం Sunday Spice కాలమ్ ఉండేది. అటువంటి 'కాలమ్' నా పత్రికలోనూ ఉంటే బావుంటుందనిపించింది. నాకు కావలసిన రీతిలో, జంకూగొంకూ లేకుండా కరాఖండిగా దాసి తాజా ఘటనపై తాజాగా స్పందించి, ప్రతివారం వేళతప్పకుండా అచ్చుకు అందించటానికి వేరెవరూ దొరకక నేనే చేయిచేసుకున్నాను. వారానికోరోజు మొదటిపేజీలో మసాలా కాలమ్ నడ పాలన్న ఆలోచన వరకూ 'క్రానికల్' నుంచి స్ఫురించినా... రాతలో, శైలిలో నాదారి వేరు. ఆ మాట కొస్తే ఇంతవరకు తెలుగులో వచ్చిన ఏ వ్యంగ్య రచనతోనూ దీనికి పోలిక లేదు.