
WITTGENSTEIN SMRUTHILO
₹150
In stock · 440 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400422
లెక్కల్లో నాకు తెలిసింది గుండుసున్నా. అయినా, గణితతర్కశాస్త్రం సరిహద్దుల్ని చెరిపేసి “నేనే చివరి తత్వవేత్తను" అని ప్రకటించుకున్న విటెన్స్టీన్ అంటే ఒక ఫాసినేషన్. అలా ఒక వ్యాసం రాసి కోరిక తీర్చుకున్నాను. చదువుకునే క్రమంలో అనేక విషయాలు, అనేకమంది వ్యక్తులు ప్రభావితం చేస్తారు. వాళ్ల గురించి మనం స్పందించక తప్పదు. అయితే, ఇవి జర్నలిస్టిక్ వ్యాసాలు మాత్రం కావు. కొన్ని కలచివేసిన సంఘటనలు. కొందరు అబ్బురపరచిన వ్యక్తులు. 17 వ్యాసాలలో చివరిది "హెర్వోస్ట్". ఒక కార్మికద్రోహిని కార్ల్ మార్క్స్ చీల్చి చెండాడిన పుస్తకం. పెట్టుబడి రాస్తూ, మధ్యలో ఆపి ఈ పుస్తకం కోసమే కాలం వెచ్చించి ప్రచురించాడు. ఎంగెల్స్ వారించాడు.. అయినా వినలేదు. "కార్మికోద్యమాన్ని రక్షించుకోలేకపోతే మన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరే గదా!" అంటాడు. ఒక రకంగా ఇది అత్యంత ముఖ్యమైన పుస్తకమే.... అయినా ఏ కొద్దిమంది పండితులకో తప్ప “విస్మృత రచన"గానే మిగిలిపోయింది. ఇక మిగతా కథనాలన్నీ ప్రపంచ చరిత్రలో జరిగిన సంఘటనలు. కాకపోతే ప్రత్యక్ష సాక్షులే వీటిని రికార్డు చేశారు. ప్రాచీన రచనల్ని చదవటంలో ఒక ఆనందముంది. - ముక్తవరం పార్థసారథి