WRONG WAY by S.M.PRAN RAO Telugu book cover

WRONG WAY

by S.M.PRAN RAO

₹80
In stock · 20 available
PublisherS.M.PRAN RAO
LanguageTelugu
నా మాట అవినీతి ఒక కల్లోల సముద్రం. దాని నిండా ప్రలోభాలనే క్రూర జలచరాలూ, డబ్బు సంపాదన అనే ఎగిసిపడే అలలూ, నవ సమాజం అందిస్తున్న సుఖలాలసలు, వినూత్న విలాసాలు, కాంక్షలు, వ్యామోహాలు వాటి ఆకర్షణ అనే సుడిగుండాలూ. అనుక్షణం ఎందరినో మానవ మనుగడకు మూలాలైన నీతి నిజాయితీల నుంచి విడదీసి తమ ఆవర్తాల కౌగిలిలో కరిగిస్తున్నాయి. ఆ కౌగిలి అన్ని విలువలను సమూలంగా నిర్వీర్యం చేస్తోంది. ఇలా అంతటా అన్ని రంగాలలోను ఊడలు పాతుకుని నాటుకుపోయిన అవినీతి గురించి సమగ్రంగా వ్రాయడం నామటుకు నాకు అలవికాని పని. అందుకే నా మధ్య తరగతి అవగాహనకు అనుగుణంగా నా పరిమితుల మేరకు ఈ అవినీతి సముద్రం మీద చిన్న రెట్ట వేసే ప్రయత్నం చేసాను. 'రాంగ్ వే' ఆసక్తిగా చదివి ముందుమాట వ్రాసి ఇచ్చిన ప్రముఖ కవి, దార్శనికుడు నగ్నముని గారికి ఎనలేని కృతజ్ఞతలు. ముఖచిత్రం గీసి ఇచ్చిన ప్రముఖ చిత్రకారుడు చిప్ప, సుధాకర్కి, డిటిపి విజయకుమారికి, పుస్తకాన్ని అందంగా ముద్రించి ఇచ్చిన XXXXXXX, పంపిణీదారులకు కృతజ్ఞతలు. అవినీతితో రాజీపడకుండా, విలువలను కాపాడుకుంటూ అవినీతిలో పీకెలదాకా కూరుకుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఈ సమాజానికి ప్రాణవాయువు అందించాలని తపిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు ఈ నవలని వినయంగా అంకితం ఇస్తున్నాను.