
Y.V.SUBBAREDDY PARLIAMENT LO PRAJA GARJANA
₹100
In stock · 194 available
PublisherY.V.SUBBAREDDY
LanguageTelugu
Y.V. SUBBAREDDY PARLIAMENT LO PRAJA GARJANA compiled by GOLI MADHAV నిండైన మనిషి, ఆప్యాయంగా పలకరించే పెద్దాయన వై.వి. సుబ్బారెడ్డి. భేషజాలు, పోటాపోటీలు లేనివారు. టిటిడి ఛైర్మన్గా శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల మీద పున్నాగ పువ్వులై విరిసిన వారు. ఒంగోలు ఎం.పి.గా పార్లమెంటులో 2014సం||లో అడుగుపెట్టారు. లోక్సభలో ఏం చేశారు? ఏం సాధించారు? ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించారు? మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎలా తీసుకు వెళ్ళారన్నదే ఈ పుస్తకం. ఒకటా, రెండా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతుల సమస్యలు, వెలిగొండ ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు, ఫ్లోరైడ్ బాధితుల సమస్యల్లాంటి ఎన్నింటిపైనో ప్రజా గర్జన చేశారు. ప్రకాశం జిల్లా ప్రజల సమస్యలంటే ప్రతిస్పందించే మొదటి మనిషి వై.వి.సుబ్బారెడ్డిగారే. లోక్సభలో ఆయన వేసిన ప్రశ్నలు 390 కాగా 54 సార్లు చర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, సామాన్య జనం కోసం పార్లమెంటులో వై.వి. సుబ్బారెడ్డి చేసిన కొండంత కృషిని అద్దంలో చూపించే ప్రయత్నమే ఈ పుస్తకం.