YAANAADI JEEVITHA CHITRAMU by EKULA VENKATESWARLU Telugu book cover

YAANAADI JEEVITHA CHITRAMU

by EKULA VENKATESWARLU

₹10
In stock · 10 available
PublisherBAHUJANA KERATALU PRACHURANALU
LanguageTelugu
యానాది జీవిత చిత్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో గిరిజన తెగలు జీవిస్తున్నాయ్. అన్ని రాష్ట్రాలకన్నా మన ఆంధ్రరాష్ట్రంలో గిరిజనులు అధిక సంఖ్యలో బ్రతుకుతున్నారు. 1976 నుంచి మన రాష్ట్రంలో అమలులోకి వచ్చినటువంటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఆదేశాల (సవరణ) చట్టం ప్రకారం షెడ్యూల్డ్ తెగల జాబితాను ప్రభుత్వం 18-6-1976 సంవత్సరం నెంబర్ 108-1976 ను విడుదల చేసింది. అంద్, బగత, భిల్, చెంచు (చెంచు దార్) గదబ, గోండు, (నామర్ పోడ్, రాజ్ గోండు) గవుడు (ఏజెన్సీ ప్రాంతాల్లో) కొండరెడ్డి, కొండకాపు, జాతాపు, కమ్మర, కట్టునాయకన్, కొలాల్ (నున్నెవార్లు) కొండదొర, కోందులు, (కోడి, కోదు, దేశ్య, కోందులు, డోంగి యా కోందులు, కుట్టియా, కొందులు తిక్రీలు, ఎనిటికోందులు) కొటియా (బెంతో ఒరియా, బర్తినే, దులియా, హాల్యా, పైకోపుటియా, సాన్రోదా, సిధోసైకో) కోయ, (గోండు, రజా, రాష్కీయ, లిగాంద్రికోయా) కొట్టుకోయ, బినకోయ, రాజ్కోయ కవీలియా, మాలియా, (అదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, వరంగల్ మినహా) మన్నెదొర, ముఖదొర (మాకదొర) నాయక్ ఏజన్సీ ప్రాంతంలో) పర్దాన్, పారజి (పరంగిపొరజ) రెడ్డి దొర, రోన (రేన) సవర (కాపు, సవర మాలియా, సవరలు, ఖుట్టోసవర) సుగాలి (లంబాడీ) తోటి (ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో) వాల్మీకి (ఏజెన్సీ ప్రాంతాల్లో) యానాది., ఎరుకల గిరిజన తెగలు ఆంధ్రదేశం అంతా అల్లుకొనివున్నారు. రాష్ట్రం మొత్తం మీద 30,028 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వున్నారు. ఇంకా కొన్నింటిని గిరిజన తెగలుగా గుర్తించాల్సే వుంది. దారీ తెన్నూ లేక కేవలం కడుపు నింపుకోవడం కోసం సంచరిస్తూ సంచారతెగలుగా చరిత్రకెక్కారు. ఒక్కోతెగకు ఒక్కోభాష, జీవితం, సాంప్రదాయం, సంస్కృతివుంది. మానవ సమాజానికి దూరంగా ఎలాంటి కల్మషంలేకుండా స్వచ్ఛంగా బ్రతుకుతున్న వాళ్ళు, స్వతంత్రులు, స్వేచ్ఛా ప్రియులు.