YAANAM VIMOCHANODHYAMAM by BOLLOJU AHMEDALI BABA Telugu book cover

YAANAM VIMOCHANODHYAMAM

by BOLLOJU AHMEDALI BABA

₹50
In stock · 8 available
PublisherBOLLOJU AHMEDALI BABA
LanguageTelugu
ముందుమాట సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచి పాలన నుండి యానాం 13, జూన్ 1954న విమోచనం చెందింది. ఈ కాలంలోనే ఫ్రెంచివారి వలస పాలన నుండి ఇండోచైనా విమోచనం చెందటానికి ఘోరమైన యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ భారతదేశంలోని ఫ్రెంచికాలనీల విమోచనం చర్చల ద్వారా, అహింసాయుత పద్ధతులద్వారా, రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. అప్పటికి మిగిలున్న నాలుగు ఫ్రెంచి కాలనీలైన పాండిచేరీ, మాహే, కారెకాల్ మరియు యానాంలలో, యానామే మొదటగా విమోచనం చెందినట్లుగా ప్రకటించుకుంది. ఇది అందరికీ గర్వకారణమే! ఎందుకంటే ఇలా జరగటంవల్ల యానాం ఓ 'క్రాంతదర్శి'గా చరిత్ర కెక్కింది. అప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా యానాం విమోచనం భిన్న కోణాలలో ఈ విధంగా దర్శించబడ్డది. 1. విమోచన ఉద్యమకారుల దృష్టిలో యానాం విమోచనమనేది 'ఫ్రెంచి పాలనా దాశ్య శృంఖలాలనుండి విముక్తమై స్వాతంత్య్ర భారతావనిలో విలీనం కావటానికి జరిపిన మహెూధ్యమ ఫలితం. 2. భారత ప్రభుత్వము యానాం విమోచనాన్ని 'స్వాగతించదగిన దురదృష్టకరమైన 39 సంఘటన' గా అభివర్ణించింది. 3. 'భారత ప్రభుత్వం తన దేశభక్తులతో చేయించిన ముట్టడిగా' దీన్ని ఫ్రెంచి ప్రభుత్వం భావించింది. 4. 'యానాం నాయకులు ఆంధ్రా ప్రజలతో కలసి ఫ్రెంచి వారినుండి అధికారాలను చేజిక్కించుకొని యానాం విమోచనం చెందిందని ప్రకటించారని' కొంతమంది స్థానికులు భావించారు.