
YAATHRIKA MITHRA DAKSHINA BHARATHA PUNYA - 175.00
by PULIGADDA VENKATA KUTUMBA VASANTHA KUMAR
₹175
In stock · 6 available
PublisherSAHITHI NAVAJEEVAN BOOKS LINKS
LanguageTelugu
శ్రీకారం కొత్త ప్రదేశాలు చూచి రావడం, కొత్త విషయాలు తెలిసికోవడం అనగానే చాలమంది గొప్ప ఆదర్శవంతమైన అభిప్రాయాలు వెలువరిస్తూ వుంటారు. నిజానికి అదొక వ్యసనం. కొంతమంది దృష్టిలో అదొక పిచ్చికూడ. 'అతనికి అదొక పిచ్చి' అని నా స్నేహితులు, బంధువులు ఒక ముద్ర వేశారు. ఆ ' పిచ్చి'ని ఈ నా పుస్తకంలోకి ఎక్కించడమంటే ! అందుకే ఈ నాలుగు మాటలు. నేను ఉద్యోగిని అని అనిపించుకున్న మొదటి దశలో ఒక పుష్కరకాలం కర్ణాటక రాష్ట్రంలో పని చేశాను. చారిత్రకంగాగాని, పౌరాణిక సంబంధంగా గాని ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు కర్ణాటకలో చాలానే వున్నాయి. ఎందుకనో అప్పుడు నాకు ఆ ప్రదేశాలు చూచి రావాలనే ఆలోచన గూడ వుండేదిగాదు. దరిమిలా నేను విజయవాడకు వచ్చాను. 1980లో ఒకసారి నా ఉద్యోగానికి సంబంధించిన పనిబడి, ఒక పది మందిమి తమిళనాడులోని మదురై వెళ్లాము, పనిలో పనిగా ఆ ప్రాంతంలోని ఏడెనిమిది ఊర్లు చూచి వచ్చాము. తిరిగి వచ్చిం తర్వాత నా స్నేహితుడు ఒకతను. ఆ ప్రాంతములు తను గూడ చూచి వద్దామని అనుకుంటున్నానని వివరాలు చెప్పమని అడిగాడు. మొదట నోటితో చెప్పినా చివరకు ఒక నోటు పుస్తకంలో అప్పటికి నాకు తెలిసిన వివరాలు వ్రాసి ఇచ్చాను. ఆ తరువాత నేను, నా భార్య అప్పటికి పదమూడు సం॥లు వున్న నా కుమారుడు కలసి 1982లో తమిళనాడులోని చాల ప్రదేశాలు, కేరళలో రెండు ప్రదేశాలు చూచి వచ్చాము. నాకు భాష విషయంలో ఇబ్బంది లేదు. తిండి విషయంలో కూడ అంతే. అంతకు ముందు స్నేహితులతో కలసి వెళ్ళి వచ్చినప్పటి అనుభవం కొంత వుంది. అయినప్పటికి, మగవాళ్ళు మాత్రం వెళ్ళి వచ్చినదానికీ, స్త్రీలు, పిల్లలుతో వెళ్లివచ్చిన దానికి వుండే బేధం అర్థమైంది. అందునా మరొకరు తోడు లేకుండా, మనకు మనమే, అంటే మన కుటుంబం మాత్రమే వెళితే పరిస్థితులు ఎలా వుంటాయో తెలిసింది. ఈ యాత్రలో కొన్ని ఇబ్బందులు పడ్డాము. కొన్ని అనుభవాలు రుచి చూశాము. ప్రతి ఊరిలోనూ మాలాగే వచ్చిన వారు, ఎవరో ఒకరు తటస్థ పడుతూవుండేవారు. వాళ్లు తాము పడిన ఇబ్బందులు చెబుతూ వుండేవారు. దీనివల్ల మనం ఒంటరిగా క్రొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని బోధపడింది. నేను పని చేస్తున్నది సుమారు మూడు వేల మంది ఉద్యోగస్థులు వున్న సంస్థ. అందువల్ల నేను చూచి వచ్చిన ప్రదేశాల గురించి వివరాలు చెప్పమని ఎవరో ఒకరు తరచుగా వస్తూ వుండేవారు. వారికి నోటితోనే నాకు తోచినంత వరకూ వివరాలు చెప్పేవాడిని. వారు తిరిగి వచ్చిన తర్వాత వారు పడిన ఇబ్బందుల గూర్చి చెప్పేవారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ వివరాలన్ని పుస్తకంగా వ్రాస్తే అందరికి ఉపయోగపడుతుంది గదా! అని, వెంటనే, అప్పటికి, నేను చూచి వచ్చిన ప్రదేశాలను గురించి వ్రాసాను. ఇది చదివిన కొందరు మిత్రులు ఇది ఎంతో ఉపయోగకరమైన పుస్తకం అన్నారు... కాని ఈ పుస్తకం అచ్చువేయించడం అనే ఆలోచన రాలేదు. ఏదైనా పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడితే చాలమందికి ఉపయోగపడుతుంది గదా అని అనిపించింది. నాకు తోచిన పద్ధతిలో రెండు మూడు పత్రికల వారికి ఉత్తరం వ్రాసాను. కాని ప్రయోజనం లేక పోయింది.