YAATRA-120 by CHAGANTI TULASI Telugu book cover

YAATRA-120

by CHAGANTI TULASI

₹120
In stock · 16 available
PublisherN.K.PUBLICATIONS
LanguageTelugu
యాత్ర "బామ్మా! నీ కోసం ఎవరో వచ్చేరు." అంటూ పరిగెట్టుకు వెళ్ళి వాళ్ళ బామ్మ చెయ్యి పట్టుకు లాక్కొచ్చేడు బాబు. ఉండ్రా! లాక్కరా, నే వస్తున్నానుగా." అంటూ తూలిపోతూ, జారిపోతున్న కళ్ళజోడుని సరిచేసుకుంటూ వీధిలోకి వచ్చింది సీతమ్మగారు. "ఎవరదీ? అమ్మన్నా, నువ్వుటే! ఎన్నాళ్ళకి చూసే! ఎన్నాళ్ళకి చూసే!" అంటూ ఇంతమొహం చేసుకొని వచ్చినావిణ్ణి సీతమ్మగారు అమాంతంగా కౌగిలించుకున్నారు. సీతమ్మ కౌగిట్లో ఒదిగిపోతున్న అమ్మన్నకి పుట్టెడు దు:ఖం పొర్లుకు వచ్చింది. ఆవిడ కళ్ళంట నీళ్ళు బుగ్గల మీంచి కారేయి. "ఎంత పెద్దదానివైనా నువ్వేం మారలేదే అమ్మన్నా! నీ పిచ్చిగుండే నువ్వూనూ." అన్నాది సీతమ్మ. "అమ్మా! పెట్టె ఎక్కడ పెట్టమన్నారు?" అంటూ రిక్షావాడు అడగడంతో ఇద్దరూ ఈ లోకంలో పడ్డారు. "ఇలా తీసుకురా, ఆ గది గుమ్మంలో పెట్టు"