YAATRA DEEPIKA WARANGAL ZILLA by P.S.M.LAKSHMI Telugu book cover

YAATRA DEEPIKA WARANGAL ZILLA

by P.S.M.LAKSHMI

₹60
In stock · 8 available
PublisherP.S.M.LAKSHMI
LanguageTelugu
యాత్రా దీపిక ముందుమాట దేవాలయాల్ని గూర్చిన చక్కని రచన వరంగల్ జిల్లాకు చారిత్రికమైన ప్రాధాన్యం ఎంతో ఉంది. ఒకప్పుడు తెలుగువాళ్ళందర్నీ ఒక గొడుగు కిందకు తెచ్చి పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల రాజధాని వరంగల్, నగరంలోనూ, వరంగల్ జిల్లాలోను చారిత్రక ప్రాముఖ్యం కల్గిన ఎన్నో ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా అంతటా ఎన్నో దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాల్లో చాలావాటిని కాకతీయులకాలంలోనే నిర్మించారు. కాకతీయులు మొదట్లో జైన మతాన్ని స్వీకరించి ప్రచారం చేశారు. ఈనాటికి వరంగల్ లోనూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జైన దేవాలయ చిహ్నాలు కనిపిస్తాయి. కొంతకాలం తర్వాత కాకతీయులు శైవులుగా మారారు. కాకతీయ సామ్రాజ్యం బలపడి తెలుగు టెశమంతా వ్యాపించాక కాకతీయులు ఎన్నో శైవ దేవాలయాలు నిర్మించి శైవ మత వ్యాప్తికోసం కృషి చేశారు. ఇంత చారిత్రక ప్రాముఖ్యం కల్గిన వరంగల్ జిల్లాలోని దేవాలయాలగూర్చి పులిగడ్డ శ్రీమహలక్ష్మి యాత్రాదీపిక వరంగల్ జిల్లా పేరుతో వరంగల్ జిల్లాలోని దేవాలయాల వివరాలను సమగ్రంగా పాఠకులకు అందిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. దేవాలయాలనుగూర్చి రచించబడిన ఈ పుస్తకం ఒక యాత్రా రచనగా (ట్రావెలాగ్) సాగింది. ఈ రచయిత్రిగారే స్వయంగావెళ్ళి అనేక దేవాలయాలను దర్శించిన అనుభవంతో ఆమె ఈ పుస్తకాన్ని రచించటంచేత మనంకూడా ఆమెవెంట వెళ్ళి ఆ దేవాలయాలను దర్శిస్తున్నామన్నట్టుగా అనుభూతి చెందటం జరుగుతున్నది. ఒక్కొక్క దేవాలయాన్నిగూర్చిన స్థల పురాణం, ఆ దేవాలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? ఆ దేవాలయంలో పూజిస్తున్న దేవతామూర్తి ఎవరు? ఆ దేవాలయానికి ఎలా వెళ్ళాలి మొదలైన వివరాన్నింటినీ మహలక్ష్మిగారు ఈ గ్రంధంలో తెలియజేశారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయంలో వరంగల్ జిల్లాకు సంబంధించిన కొన్ని వివరాలను తెలియజేశారు. వరంగల్ జిల్లా