
YAATRANANDAM
by DR.PATIBANDLA KRANTHI KUMAR
₹50
In stock · 2 available
PublisherDR.PATIBANDLA KRANTHI KUMAR
LanguageTelugu
మనవి 2006 మే నెలలో ఒక పర్యాటక సంస్థ వారి 13 రోజుల టూర్లో కొన్ని పశ్చిమ యూరప్ దేశాలను సతీసమేతంగా దర్శించాను. పర్యటనలోని కొన్ని ముఖ్యమైన విశేషాలను నోట్ చేసుకున్నాను. మిత్రుల సలహాతో కార్యక్రమానికి రెండు రోజుల ముందే లండన్ వెళ్ళి మరికొన్ని దర్శనీయ స్థలాలను చూశాము. ప్రపంచ దేశాల్లోని వివిధ ప్రాంతాలను, మన దేశంలోని చారిత్రాత్మక స్థలాలను, పుణ్యక్షేత్రాలను చూస్తున్నప్పుడు మనమెంత, మనకున్న విజ్ఞానం ఎంత, మనం చూడవలసిందీ, నేర్చుకోవలసిందీ ఎంతో ఉందని అనిపిస్తుంది. ఆయా ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైని, వారిలో ఉన్న మంచి చెడులు, అలాగే మనలో ఉన్న గొప్పదనం. మనలోని లోపాలు- ఇవన్నీ అవగాహన చేసుకోవచ్చు. మనకంటే చిన్నదేశాలు క్రమశిక్షణ, కష్టపడి పనిచేయటం, వంటి మంచి లక్షణాలతో ఎంతో వృద్ధి చెందుతున్నాయి. వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మనదేశం అధిక జనాభా, సోమరితనం, అనైక్యత, కుల, మత, భేదాలు మొదలైన కారణాల వల్ల ఇంకా ఎంతో అభివృద్ధి చెందవలసిన పరిస్థితికి బాధ కలగక మానదు. ప్రపంచీకరణ దృక్పథం వల్ల వివిధ దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడి, మధ్య తరగతి కుటుంబాలకు కూడా విదేశ పర్యటనావకాశాలు అందుబాటులో ఉంటున్నాయి. వివిధ దేశాల పర్యటన, మనలో సర్వ మానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సౌహార్దత, విశ్వజనీనతలను మరింత పెంపొందిస్తాయనటంలో సందేహం లేదు. "విదేశీ పర్యటనవల్ల మన సంకుచిత భావాలు తగ్గుముఖంపట్టి, విశాల దృక్పధం అలవడుతుంది". ప్రముఖ పాత్రికేయులు, అనేక వార్తా విశ్లేషణా వ్యాసాలతో పాటు విదేశ పర్యటనా విశేషాల గ్రంథాలను రచించిన ఐ. వెంకట్రావే గారికి ముందుమాట వ్రాసి నన్ను ప్రోత్సహించి నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. లండన్లో మా ఇద్దరికీ సాదరంగా స్వాగతం పలికి, నగర విశేషాలను రెండు రోజులపాటు చూపించిన నా తమ్ముని కుమార్తె డా॥ అనిల (కీ.శే. పాటిబండ్ల సురేంద్రనాథ్, శ్రీమతి ప్రమీలల కుమార్తె) డా॥ రాజేష్ మల్లిక్ (విజయవాడ వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ గొట్టిపాటి రాంబాబు దంపతుల కుమారుడు) లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు. ఈ పుస్తకం ప్రూఫులను దిద్దటంలోను, ఫోటోలను ఎంపిక చేయటంలోనూ నాకు తోడ్పడిన మిత్రులు, వాకర్స్ క్లబ్ కార్యదర్శి "యోగాచార్య” షేక్ మొహిద్దీన్ బాచ్చా గారికి నా కృతజ్ఞతలు.