
YABHAI DATINA YAVVANAM
by SOWBHAGYA
₹90
In stock · 31 available
PublisherSOWBHAGYA
LanguageTelugu
Yabhai Daatina Yavvanam నిజమైన హీరో ఆదాయ వ్యయాలతో సుఖాన్ని అంచనా వెయ్యొచ్చు కానీ ఆదాయ వ్యయాలతో ఆనందాన్ని కొలవలేము కోటి మంది ముందు నటించే హీరోకు కోట్ల రూపాయలిస్తారు పత్రికలో అచ్చయినా ఒకోసారి కవికి పారితోషికం అందదు హీరో నటిస్తాడు కవి జీవిస్తాడు లోకం నటననే నమ్ముతుంది వెండి తెరమీద హీరో వద్దన్నా కనిపిస్తాడు పాఠకదేవుళ్లయినా, వీక్షక దేవుళ్లయినా డబ్బులిచ్చుకోందే వినోదాన్ని పుచ్చుకోలేరు వివేకం నిండిన కవికి విలువ కట్టలేం విలువ కట్టేవన్నీ విలువ కోల్పోయేవే నిజమైన కవి దగ్గర జనాకర్షక పథకాలుండవు స్వప్నలోక సంచారి సౌందర్యారాధనలో వుంటాడు సంతోషంలో మునిగి వుంటాడు, సంగీతంలో మునిగి వుంటాడు పూలతో మాట్లాడే కవిని చూశారా? వెన్నెల్ని కన్నుల్తో తాగే కవిని చూశారా? ఆకాశం ఆశీర్వాదాన్ని అందుకుంటున్న కవిని చూశారా? రేటింగులేని, ఓటింగులేని, చీటింగులేని రేయింబవళ్ళ మీద చేతులు వేసి హాయిగా సాగే కవిని చూశారా? సంపదతో నిమిత్తం లేని సంతోషాన్ని అందుకోవడం అతనికి తెలుసు జనమంతా హీరోల్ని చూసి ఈర్ష్యపడితే హీరోని చూసి కవి జాలి పడతాడు ఎందుకంటే నేటి హీరో రేపటి జీరో జీవితాంతం ఎవడూ హీరోగా వుండలేడు కవి ఒక్కడే ఎప్పుడూ హీరో కావాలనుకోడు కవి ఒక్కడే మనిషిగా జీవిస్తాడు కవి ఒక్కడే మనిషిగా మరణిస్తాడు