
YADHUVAMSA BALIJAKAPU RAJULA CHARITRA
by BHATTARUSETTI PADMARAO RAYALU
₹200
In stock · 1 available
PublisherBHATTARUSETTI PADMARAO RAYALU
LanguageTelugu
1. సువర్ణ గరుడ ధ్వజం మనది మొదట హిందూదేశం తర్వాత భారతదేశం మన బలిజ కాపు జాతి జాతీయ పతాకం సువర్ణ గరుడ ధ్వజం. మానవజాతికి వాగరికత నేర్పిన జాతి. భూగోళములోని ఏబయి ఆరు దేశాలు పాలించి, ఏభైఆరు దేశాలలో వాణిజ్యంచేసి, ఏభై ఆరు దేశాలలో దేశాయి, దేశపతి, దేశాయిశెట్లుగా ఉండి ప్రజలను ధర్మం తప్పక పాలించిన జాతి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన "500" వీర శాసనాలు కలిగిన జాతి. కృతయుగ ప్రారంభంనాటి కులం, ప్రపంచములో అన్ని దేశాలలో “సువర్ణ గరుడ భజము" రెపరెప లాడింది. ఈ పతాకంపై 5 రంగులు ప్రస్పుటంగా కనిపిస్తాయి. (1) కాషాయం - త్యాగానికి చిహ్నం. (2) ఆకుపచ్చ సంపదకు, స్వయం సమృద్ధికి ఆర్ధిక పరిపుష్టికి చిహ్నం. (3) పసుపు భారతీయ సమాజములో అత్యంత శుభప్రదమైనది. (4) తెలుపు - స్వచ్ఛతకు, శాంతికి చిహ్నం. (5) బంగారు రంగు - సర్వ శుభాలకు సంపదకు చిహ్నం. ప్రపంచ మానవాళి చరిత్రలో ఇంతటి ఘనకీర్తి కలిగిన జాతి మరొకటి లేదు.