YAJURVEDEEYA SANDHYAVANDHANAM by APPARUSU VIJAYARAMARAO Telugu book cover

YAJURVEDEEYA SANDHYAVANDHANAM

by APPARUSU VIJAYARAMARAO

₹60
In stock · 5 available
PublisherAPPARUSU VIJAYARAMARAO
LanguageTelugu
ముందుమాట సంధికాలంలో ఆరాధించాల్సిన దేవత సంధ్యాదేవత. ఆ దేవతనే సూర్యమండలంలో వుండే చైతన్య శక్తి అనీ, గాయత్రీ దేవత అనీ అంటారు. సంధికాలంలో ఏ దేవతని ఉపాసించినా, దాన్ని సంధ్యావందనం అనే అంటారు. రాత్రికీ, పగలుకీ వుండే సంధి ప్రాతః కాలం. అలాగే, పగలుకీ, రాత్రికీ వుండే సంధి సాయంకాలం. ఈ కాలంలో వుపాసించే దేవత పేరే సంధ్య. సంధికాలంలో సంధ్యాదేవిని ఉపాసించడం అందరూ చేయాల్సిన కర్తవ్యమే. కాని, వాళ్ళ వాళ్ళ అధికార తారతమ్యాల్ని బట్టి ఉపాసనా క్రమం వేర్వేరుగా వుండవచ్చు. అది వాళ్ళ యోగ్యతానుసారంగా స్తోత్రపాఠంగానూ వుండవచ్చు; లేదా మంత్రపాఠంగానూ వుండవచ్చును. అథవా భజన రూపంలోగానీ, ధ్యాన రూపంలోగానీ వుండవచ్చు. స్త్రీలైనా, పురుషులైనా, శ్రేయస్సు కలగాలని కోరుకునే వారందరూ చేయాల్సింది సంధ్యోపాసన. సంధ్యోపాసన వల్ల ఎప్పటి పాపం అప్పుడే నశించి పోతుంది. పుణ్యం కలుగుతుంది. ఈ పుణ్య సంపాదనవల్ల భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా జన్మ కృతార్థమౌతుంది. దాన్నే మోక్షం అని అంటారు. కాబట్టి అందరూ తమ తమ ధర్మాన్ని అనుసరించి తప్పనిసరిగా సంధ్యోపాసన చేయాలి. స్వధర్మాన్ని అనుష్ఠించడం వల్ల మృత్యువును కూడా ఎదిరించే ధైర్యం వస్తుంది. సత్యమేవాభిజానీమ: నానృతే కుర్మహే మతిమ్ | స్వధర్మమనుతిష్ఠామస్తస్మాన్మృత్యుభయం న నః॥ (మహాభారతం) "మేం కేవలం సత్యాన్నే తెలుసుకుంటున్నాం. అసత్యం పట్ల మా బుద్ధిని నిల్పడం లేదు.