
YAKSHAGANAPARIJATHAMU
₹250
In stock · 30 available
PublisherDR.P.RAMESH NARAYANA
LanguageTelugu
ముందుమాట ఆంధ్రవాఙ్మయప్రపంచంలో యక్షగానము విశిష్టము, వైవిధ్యభరితము అయినట్టి ఒక దేశిసాహిత్యరూపకప్రక్రియ. దక్షిణాంధ్రయుగంలో అత్యంతప్రభావశీలకమైన ఒక సాహిత్యరూపంగా, సంగీతనృత్యయుతంగా, దృశ్యశ్రవ్యకావ్యంగా, పండితపామర జనరంజకంగా ప్రాచుర్యంపొందిన నాటకస్వరూపము యక్షగానము. చారిత్రకంగా యక్షగానసాహిత్యానికి స్వర్ణయుగంగా సైతం పేరుపొందిన కాలము ఇది. పందొమ్మిదవ శతాబ్దకాలంనుండి తెలుగుసాహిత్యజగత్తులో ఎందరో ప్రసిద్ధులైన వాఙ్మయపరిశోధకులు ఈఅంశాన్ని చేపట్టి మొక్కవోని పరిశోధనగావించి ఎన్నోవిలువైన అంశాలను వెలుగులోనికి తీసుకొనివచ్చి పరిష్కరణలు, గ్రంథరచనలు గావించారు. ప్రస్తుతకాలంలో ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని ఎందరో విశ్వవిద్యాలయ ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు, సాహితీమూర్తులు యక్షగానకృతులను తెలుగుసాహితీజగత్తుకు కొంతదాక పరిచయం గావిస్తున్నారు. ప్రసిద్ధపండితపరిశోధకులు ఆచార్య బిరుదురాజు రామరాజుగారు (యక్షగానవాఙ్మయము, 1972) అన్నట్టుగా "దాదాపు ఆరునూరేండ్లుగా వృద్ధిపొందుతున్న ఈయక్షగానము సంగీతసాహిత్య కళాసంగమమై, పండితపామరజనముల కానందదాయియై, రాజసభాంతరాళముల మన్ననలకు పాత్రమై, అనేకవిధములయిన ఇతివృత్తముల నిముడ్చుకొని దేశిచ్ఛందోవైవిధ్యమునకు నెలవై, తెలుగు నుడికారమునకు పలుకుబడికి తావై, సాంఘికచరిత్రకు స్థానమై, ఇప్పటికిని సజీవసాహిత్యశాఖగా నుండుట తెలుగుసాహిత్యముయొక్క పుణ్యము".