
YALAI POODSINDI
₹150
In stock · 12 available
PublisherPALLIPATTU NAGRAJU
LanguageTelugu
Yaalai Poodsindi పల్లిపట్టు నాగరాజుకి సంక్రమించిన శ్రమవారసత్వం నుంచి, వాతావరణం నుంచి.. ఒక బహుళత నుంచి, మంది సంస్కారం నుంచి ఏర్పరచుకున్న ఒక శైలిలో కవితల్లాడు నాగరాజు. బహు ఆకర్షణీయంగానూ, ఆప్యాయంగానూ, లాలిత్యంలోనూ, రమణీకతతోనూ... అవి మనల్ని ఆకట్టు కుంటాయి. ఇది నాగరాజు మొదటి కవితాసంపుటి. అక్కడక్కడ యితరుల మధ్యనుంచి విన్పించినట్టు అతని వెనకమాల నీడలో కదులుతున్నట్టూ వుంటుంది. అయితే వీటన్నింటి మధ్య అతను నిలువెత్తు నుంచున్నాడు. తను తనుగా ఉండటానికి, ఎదగడానికీ చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా కన్పడుతుంది. బేసిగ్గా ఇతను రాజకీయకవి. పీడక కుల, పాలక రాజకీయాల్ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ రాస్తున్నకవి. రాజకీయ కవిత్వం రాసే కవులు తక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి కవుల అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఇతను కవి ప్రసాదమూర్తి, సుధాకరమౌళీ, అనిల్ నీల సరసన నిలపగలిగినవాడు. వారిలాగే బతుకులోని బహుమూలాల్ని ఆశ్రద్ధ చేయకపోవడం మరో ప్లస్ పాయింట్. -జి.లక్ష్మీనరసయ్య