YALAMANCHILI VENKATAPPAIAH SAHITHYA PARICHAYAM by THUMMA BHASKAR Telugu book cover

YALAMANCHILI VENKATAPPAIAH SAHITHYA PARICHAYAM

by THUMMA BHASKAR

₹10
In stock · 37 available
PublisherTHUMMA BHASKAR
LanguageTelugu
నా మాట భావ విప్లవంలో భావ సారూప్యంగల నాస్తికత్వం, హేతువాదం, మానవవాదం ప్రచార ఉద్యమంలో తెలుగునాట తుదిశ్వాస వరకు పాటుపడిన వ్యక్తుల జీవితాలు గురించి తెలుసుకోవాలంటే దొరకడం కష్టం. ఏకొందరివో లభిస్తాయి. ప్రముఖ హేతువాదులైన రావిపూడి వెంకటాద్రి, పెన్మత్స సుబ్బరాజుగారలు వ్రాసిన ఆంధ్రప్రదేశ్లో హేతువాద, మానవవాద ఉద్యమాల చరిత్ర (2003) పుస్తకంలో ఇలాంటివారి గురించి అతి తక్కువ సమాచారం లభిస్తుంది. కొందరు తమ స్వీయ చరిత్రలను వ్రాసుకున్నారు. మరి మిగతావారి గురించి కూడా ముందు తరాలకు తెలియాలంటే ఎలా అనే ఆలోచన నాకు కలిగి వారి జీవితాలను గురించి సేకరించి భావవిప్లవ భావ సారూప్యంగల పత్రికల ద్వారా చదువరులకు అందించాలనుకున్నాను. నాలోని ఆలోచనను మానవ వికాస వేదిక రథసారథి బి. సాంబశివరావుగారికి తెలపగా వారు వాటిని తమ పత్రిక 'స్వేచ్ఛాలోచన'లో ప్రతి నెలా ఒకరి గురించి ప్రచురిస్తానంటు నన్ను ప్రోత్సహించారు. నేను ఉద్యమకారుల ఇళ్ళకు వెళ్ళి కుటుంబీకుల ద్వారానో, స్నేహితుల ద్వారానో సమాచారాన్ని సేకరించసాగాను. కేవలం ఉద్యమంలో పాల్గొనడంకాదు, భావవిప్లవ సాహిత్యాన్ని అందించినవారో లేదా ఏదేని ప్రత్యేకత కలిగిన వారివి మాత్రమే పత్రికకు అందించసాగాను. ఆ కోవలోనే యలమంచిలి వెంకటప్పయ్యగారి జీవితం గురించి సేకరించడానికి విజయవాడలో ఉంటున్న ఆయన కుమారుడైన మురళీధర్గారిని కలిసాను. ఆయన తన తండ్రి గురించి అనేక విషయాలు చెప్పి, తండ్రి వ్రాసిన పుస్తకాలన్నింటిని తీసుకొచ్చి నా ముందు పెట్టి నన్నొకటి కోరారు. అదేమంటే, వీటన్నిటిని చదివి వీటిపై సమీక్ష వ్రాసి ఇస్తే మేము ప్రచురించగలమన్నారు. నేను ఆశ్చర్యపోయాను, వెంకటప్పయ్యగారు ఇన్ని పుస్తకాలు వ్రాసారా? అని నేను వారిది 'వేదాలంటే ఇవేనా?' అనే ఒకే ఒక పుస్తకం దాదాపు 25సం||ల క్రితం చదివాను. వారిపై అభిమానాన్ని పెంచుకున్నాను. కాని, నా ఉద్యోగభారం వలన వారిని కలవడానికి వీలు కలుగలేదు. నేను మురళీధర్ గారి కోరికను ఒప్పుకున్నాను. వారిచ్చిన పుస్తకాలన్ని ఇంటికి తెచ్చుకున్నాను. కాకపోతే వెంకటప్పయ్యగారు మొత్తం పుస్తకాలలో (37) మాత్రమే లభించాయి. అందుకే వాటి వరకే పరిశీలన వ్రాసాను.