
YASODHARA JATHAKA KATHALU
₹50
In stock · 7 available
PublisherM.RAJAGOPALA RAO
LanguageTelugu
ISBN03107742
నిదానం జాతక కథలు ప్రపంచానికి కొత్త కాదు. పాళీలో ఉన్న 547 జాతక కథలు ప్రపంచ ప్రసిద్ధ భాషలన్నిటిలోనూ అనువాదమయి ప్రసిద్ధమయిపోయాయి. స్వామి శివశంకరశాస్త్రిగారు వాటిని తెలియజేశారు. సిద్ధార్థుడు అభినిష్క్రమణంజేసి యథా భూత జ్ఞానదర్శన సాధనలో సాగి సంబోధి అందుకొనే వరకు అనంతకాలంలో అనేక జన్మలు పొందాడనీ ఆ జన్మలలో పారమితల (పాళీ పారమీ) నిర్వహణలో చేసిన త్యాగాలనివి ఉగ్గడిస్తాయి. నిజానికి ఈ ఆదర్శం లోకోత్తరవాదులయిన 'మహా సంఘికుల'ది. అటుతరవాత 'మహాయానులు' దానిని కొనసాగించారు. మనకిప్పుడు అందికలోకి వచ్చిన పాళీ జాతక కథలు క్రీ.శ. ఐదో శతాబ్దంలో (420) ఆచార్య బుద్ధఘోష తీర్చిదిద్దినవి. అప్పటికి ఈ ఆదర్శాన్ని 'థేరవాదులు' గూడా స్వీకరించారని దీనివల్ల స్పష్టమవుతుంది. ఆచార్య బుద్ధఘోష మహాపండితుడు. సింహళ భాషలో నమోదయి ఉన్న పాళీ సాహిత్యాన్ని మధించి, పునరుద్ధరించి, వ్యాఖ్యానించి ప్రపంచానికి అందించిన మహా మహుడు. జాతకథ వర్ణనలుగా ఉన్న గాథలను కథలగా విస్తరించి, ప్రతి కథనూ దూరేనిదానం, అవిదురేనిదానం, సంతికేనిదానంగా వింగడించి; పారమితలను, దశ పారమితలు అంగాలు త్యాగంజేసేవి; దశ ఉపపారమితలు త్యాగంజేసేవి; దశ పరమార్థ పారమితలు జీవితం త్యాగంజేసేవిగా విశ్లేషించి పారమితల స్వరూప స్వభావాలను సమగ్రంగా జాతక కథల రూపంలో అందించిన మహామేధావి. సంపద అయితే చారిత్రక దృక్పథంతో పరిశీలించినప్పుడు అంతకు ముందే బుద్దుని జీవితంతో ముడిబడి ఉన్న కథనాలు మిశ్రమ సంస్కృతంలో, సంస్కృతంలో తయారయాయని తేలుతున్నది. క్రీ.శ. మొదటి శతాబ్దానికి పూర్వమే లోకోత్తరవాదు లయిన మహా సంఘికులు 'అవదానం'గా, 'వినయపిటకం'గా 'మహావస్తు'ను తీర్చి దిద్దుకొన్నారు. దానిలో 40 దాకా జాతక కథలున్నాయి. అందులోనే ఈ 'యశోధర జాతక కథలు'. క్రీ.శ. మొదటి శతాబ్దంలో అశ్వఘోషుని 'సూత్రాలంకార' సంస్కృతంలో తయారయింది.