
YATRA NAARYASTU POOJYANTHE
by S.A.RAO
₹60
In stock · 1 available
PublisherS.A.RAO
LanguageTelugu
ప్రశంస శ్రీ యస్సేరావ్ రచించిన "ఇంట్లోపోరు- వీధిలో హోరు" నాటికి ప్రేక్షకుడికి మంచి రిలీఫ్, అహ్లాదాన్నీ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వాస్తవ సంఘటనల్ని తీసుకుని సహజసంభాషణలతో, సునిశితశైలిలో తగిన మోతాదులో హాస్యాన్ని జోడించి అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా రచన సాగింది. వరకట్న సమస్యపై ఎన్నో నాటికలు, నాటకాలు రచింపబడ్డాయి. అయితే ఈ నాటికకు ఒక ప్రత్యేకత వుంది. స్త్రీల సమస్య తీసుకుని, అన్నీ స్త్రీ పాత్రలే సృష్టించి, పరిష్కారం కూడా స్త్రీ ద్వారానే చెప్పించి, నేటి సమాజంలో స్త్రీని కళ్లకు కట్టినట్టు చూపించడమే ఈ నాటికలోని ప్రత్యేకత. ఒక కుటుంబంలోని స్త్రీ విభిన్న మనస్తత్వాలను నిశితంగా పరిశీలించి చాలా సహజంగా పాత్రలను సృష్టించడం జరిగింది. "మీ కన్న కూతురు అత్తవారింట్లో సుఖపడాలని కోరుకున్నట్టే మరో తల్లి కూతురైన మీ కోడలు కూడా సుఖంగా వుండాలని మీరూ కోరుకుంటే అప్పుడు ప్రతి ఇంటికోడలూ సుఖంగా, సంతోషంగా వుంటుంది. ప్రతీ ఇల్లూ వెలుగురేకలతో కళకళలాడుతూ వుంటుంది" అనే సందేశాన్ని యిచ్చి, కట్నం కోసం కోడళ్లను వేధించే అత్తలకు కనువిప్పు కలిగించారు రచయిత. ముఖ్యంగా ఈనాటికలో ప్రధానపాత్ర జయమాలినిని ప్రేక్షకుల ప్రశంసలు అందుకునేలా మలిచారు. ఆటాపాటలతో ప్రేక్షకులను నవ్విస్తూ, కవ్విస్తూ కోడళ్లను హింసించే అత్తలకు బుద్ధి చెప్పి నాటికను సుఖాంతం చేసేపాత్ర ఇది. తెలుగు నాటకరంగానికి ఒక మంచినాటికను అందించిన రచయిత ఎంతైనా అభినందనీయులు. ఈ దేశంలో వరకట్న సమస్య పతనమయ్యే వరకూ ఈ నాటిక ప్రేక్షకుల గుండెల్లో సజీవంగానే వుంటుంది. ఎన్నోసార్లు రంగస్థలం మీద ప్రదర్శింపబడి ఎందర్నో ప్రభావితం చేసిన ఈ నాటిక దూరదర్శన్ ద్వారా కూడా ప్రసారమయ్యింది.