YAVA NAVVANAM - CHALAM KATHALU by CHALAM Telugu book cover

YAVA NAVVANAM - CHALAM KATHALU

by CHALAM

₹300
In stock · 60 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788168779860
చలం కథాలోకం చలం కథలు గిలిగింతలు పెడతాయి. గిల్లితమాషా చూస్తాయి. గిచ్చి రెచ్చగొడతాయి. వీటికి ఉబలాటపడో, ఉలుక్కొనో, పళ్లుకొరుక్కొనో - పుస్తకం విసిరేసో - దిండుక్రింద దాచుకొనో - 'అంతే' అనుకుంటే అసలయిన చలానికి దూరంగా జరిగినట్లే. నిజమే గిలిగింతలు, గిచ్చటాలు ఉన్నాయి. అవన్నీ చదివించటానికి పాఠకునికి వేసిన ఎరలు. ఆయన కావాలనే, తెలిసే వేశాడు-ఆ మాట తానే అన్నాడు. అంతవరకు తెలుగు కథకు లేని, చలం ఇచ్చిన, టెక్నిక్ (కథనశిల్పం)లో భాగమే అదంతా. వీటికి మురిసిపోయినవాళ్లు, మూతిముడుచుకున్నవాళ్లు చలాన్ని సెక్స్ రచయిత అని ముద్రవేశారు. ఆ ముద్ర ఎంత తప్పో మూడోసారి చదివితేగాని తెలియదు. (రెండోసారికి గూడ ఇంకో కోలుకోము గనుక). అప్పటికిగాని పాఠకుని మనసులో పొంగు చల్లారదు. 'నిజమే! అన్ని కథలలో స్త్రీ పురుష విషయం ఓ నేపథ్యంలాగ ఉంటుంది. కాదేమో!! అది ఒక యవనిక, మేలిముసుగు రవసెల్లా. వీటి వెనుక చాలా ఉన్నాయి. దేశ విషయాలున్నాయి. దేశభక్తి రాజకీయాలున్నాయి. గాంధీతత్వ విచారణలు, హరిజన సమస్యలు, దేశనాయకుల (ఛోటా) స్వభావాలు, తాత్విక మార్మికతల, జీవన సౌందర్యలక్ష్యాలు, చిలిపి మనస్సులు, కోర్కెలను అణచిన అహంకారాలూ, మనసుల ద్వంద్వ ప్రవృత్తులు, అన్నీ నిశితంగా ఉన్నాయి. అటువైపు దృష్టిని లోతుగా సారిస్తే ఇవన్నీ కనిపిస్తాయి. చలం తత్వం ఫిలాసఫీ అంటామే) తెలుస్తుంది. స్త్రీ పురుష కామ సంబంధ ప్రసక్తి లేని కథలు 1/5 వరకు ఉన్నాయి. స్త్రీ పురుష విషయాలలో ఎంత నిష్కర్షగా కొత్త చూపును ప్రతిపాదిస్తారో, వీటిలో గూడ అంత నిష్కర్ష-