
YAVANIKA
₹200
In stock · 5 available
PublisherDR.PEDDI RAMARAO
LanguageTelugu
ISBN9789351045519
గత ఇరవై సంవత్సరాలుగా పెద్ది రామారావు సాంస్కృతిక రంగంలో రకరకాల స్థాయిల్లో కృషి చేస్తున్నారు. 1994లో సెంట్రల్ యూనివర్సిటీలోని నాటక విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ వచ్చిన పెద్ది అదే యూనివర్సిటీలో పిహెచ్.డి. కూడా చేశారు. కవిత్వం రాశారు. అనేక కథలను నాటకాలుగా మలచి ప్రదర్శించారు. ఎం.ఏ.కీ, పిహెచ్.డి.కీ మధ్య ఒక ఏడాది కాలం 'సుప్రభాతం' పత్రికలో జర్నలిస్టుగా పనిచేసి సమకాలీన రాజకీయాలపై అనేక ఆసక్తికరమైన వ్యాసాలు రాశారు. ఆ రోజుల్లోనే భద్రాచలం అడవుల్లో నక్సలైట్ల దళాన్ని కలిసి వారి జీవనంపై ఆసక్తికరమైన కథనం అందించారు. అప్పట్లో దూరదర్శన్ ప్రేక్షకులను సమ్మోహపరచిన 'ఋతురాగాలు' ధారావాహికకు కథారచయితగా పనిచేశారు. ఆ తర్వాత 'యవనిక' అనే నాటకరంగ పత్రికని ప్రారంభించారు. ఏప్రిల్ పదహారుని తెలుగు నాటక దినోత్సవంగా ప్రకటించాలని మన రాష్ట్రంలో తొలిసారిగా ఉద్యమస్థాయిలో కృషి చేశారు. అత్యంత భారీస్థాయిలో రెండు జాతీయ నాటకోత్సవాలను నిర్వహించారు. తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. రతన్ టాటా ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో సెంట్రల్ యూనివర్సిటీ రంగస్థల కళల శాఖతో కలిసి తెలుగు నాటక రంగ పునర్వికాసం కోసం ఒక కొత్త ప్రాజెక్టు రూపొందించారు. ఆ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్లోని గోల్డెన్ త్రెషోల్డ్న ఒక నాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం యన్.టి.ఆర్. ట్రస్ట్ నుంచి అనేక నూతన కార్యక్రమాలను రూపొందించే 'పనిలో నిమగ్నమయ్యారు. దశాబ్ద కాలంపైగా వివిధ సందర్భాలలో వారు రాసిన నాటక వ్యాసాలను ఒక చోట చేర్చి ఈ సంకలనాన్ని అందిస్తున్నాం. సమకాలీన తెలుగు నాటక స్థితిగతులను అత్యంత విమర్శనాత్మకంగా వివరిస్తుందీ పుస్తకం.