YAVANIKA RADIO NATAKALU by ATHALURI VIJAYALAKSHMI Telugu book cover

YAVANIKA RADIO NATAKALU

by ATHALURI VIJAYALAKSHMI

₹125
In stock · 6 available
PublisherATHALURI VIJAYALAKSHMI
LanguageTelugu
రేడియో నాటకాలు ఒక్కమాట రచనలల్లో ఎన్నో ప్రక్రియలున్నాయి. వాటిల్లో నాటకం రమ్యమైనదనీ పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఇందులో సంభాషణలుంటాయి. కథలోగాని, నవలలోగాని, జరుగుతున్నదాన్ని స్థితిని రాయొచ్చు. నాటక రచనలో సంభాషణ ద్వారానే అన్ని తెలియచేయాలి. నాటకంలోకూడా చదువుకునేది వేరు, ప్రదర్శించేది వేరు, వినేది వేరు. కొన్ని నాటకాల్లో మాటలు నడుస్తున్నా అవి ప్రదర్శనయోగ్యంగా ఉండవు. కొన్ని ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటాయి. నాటక రచనలో కూడా తేడాలున్నాయి. స్టేజీ నాటకం ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆంగీకాభినయం ఉంటుంది. అంతా రంగస్థలంమీదనే జరగాలి కనుక సంభాషణకి ప్రాధాన్యం ఉన్నా, కొంత నిశ్శబ్ధం కూడా ఉంటుంది. సినీమా, టీవీ దృశ్యమాధ్యమాలు. సినీమా దృశ్యానికే ప్రాధాన్యత ఇస్తుంది. దృశ్యంద్వారా చెప్పలేకపోయినది సంభాషణ చెబుతుంది. టివీ నాటకాలు మొత్తం “వాగుడు” గానే ఉంటున్నాయి. కష్టసాధ్యమైన రచన శ్రవణనాటకం. ఇది వింటూ ఉండడమే కాని, చూడడానికి అవకాశం లేదు గనక వినికిడి ద్వారానే అంతా కనిపించాలి. అది కూడా మరీ చెప్పాలని చెప్పకూడదు. "రండీ- కూచోండి” అని ఒకరు అనగానే “వచ్చాను- కూచున్నాను" అని రెండోమనిషి చెబితే గాని అతను కూచున్నట్లు అర్థం కాదు. ఇలా రాయడం బాగుండదు గనక అతగాడు కూర్చున్నాడన్నట్టుగానే రాయాలంటే కష్టం. ఇలాంటి నాటకాలు రేడియో వచ్చిన తర్వాత వచ్చాయి. ఈ నాటకాల్లో నిశ్శబ్దం పనికిరాదు. మొదటినుంచి సంభాషణల మీదనే నడుస్తుంది.