
YE DESAMEGINA
by DR.TANGIRALA MEERA SUBRAHMANYAM
₹100
In stock · 14 available
PublisherDR.TANGIRALA MEERA SUBRAHMANYAM
LanguageTelugu
ముందుమాట ఇది నా ఆరవ కథాసంకలనం, ఈ సందర్భంగా నా రచనలను ప్రచురించి, ప్రోత్సహిస్తున్న పత్రికా సంపాదకులకు, ఆదరిస్తున్న పాఠకులకు మరొకమారు కృతజ్ఞతాభివందనాలు తెలుపుకునే అవకాశం దొరికింది. ఈ పుస్తకంలోని కథలను ప్రచురించిన ఆంధ్రభూమి వార, మాస పత్రికలు, నవ్య, రచన, నది, గృహశోభ, విపుల పత్రికా సంపాదకులకు, బొమ్మలు వేసిన చిత్రకారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పుస్తకం ముద్రించిన వారికీ, డి.టి.పి. చేసిన డి. దస్తగిరి గారికి కృతజ్ఞురాలిని. ఎప్పటిలాగే ఈ పుస్తకానికీ అట్ట మొదలుకొని చివరి పేజీ దాకా అందంగా రావడానికి సహాయసహకారాలు అందించిన నా భర్త శ్రీ సుబ్రహ్మణ్యంగారికీ, కూతుళ్ళు బృంద, ముకుంద, నందులకు ప్రేమాభినందనలు. ఇంతవరకు వచ్చిన నా అయిదు కథా సంకలనాలను ఆదరించినట్టే ఈ “ఏదేశమేగినా” కథా సంకలనాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ, సహృదయులైన పాఠకులకు నా నమస్సులు.