
YEDA LAYALO KAVITVAM
₹60
In stock · 8 available
PublisherSHASHANK PRACHURANALU
LanguageTelugu
ఒకేమాట స్నేహానికన్న మిన్న ఏమీ లేదన్న సత్యవాక్యానికి నిండు నిదర్శనంగా నిలిచిందే ఉ కవితా సంకలనం. మౌనభాషలోంచి సముద్రమంత భావాన్ని కవితల రూపంలో మనముందు ఆవిష్కరించిందే ఈ కవితాసంకలనం. సాధారణంగా సుజనాదేవి గారు కధల రూపంలో నిత్యనూతనత్వంతో అనేక కథలను మనముందుకు తీసుకొచ్చారు. కరకురాలుగా అనేక దిన, వార, పక్ష, మాస పత్రికలలో తన ప్రత్యేకతను చాటినారు. అలాంటి వారు తన నిడివిని తగ్గించుకొని ముస్తాబుచేసిన అందమైన అక్షర రూపమే పి. అమ్మరూపాన్ని భావనల్ని అమ్మగా కవయిత్రిగా రాస్తూ 'అమ్మ అనే ఆర్తనాదం కన్న పేగును ఎన్కౌంటర్ చేసింది' అంటూ అమ్మకు దూరమై ఆశయానికి అనంత వాయువుల్లో కల్సిన యోధులను తలపోసుకున్నారు. నవ్వు నలభై విధాల గ్రేటు... అంటూ లాఫింగ్ క్లబ్లు ప్రారంభించి కృత్రిమంగా నవ్విస్తుంటే.. పసిపాప నవ్వునుండి పడతి నవ్వు వరకు సమాజం చిరునవ్వు నవ్వితే సమస్తం విశ్వశాంతి మయం అని ముక్తాయింపుగా సమాజం నవ్వును ఆకాంక్షించి విశ్వమంత హృదయకాంక్షను మనముందుంచినారు. సుజనాదేవిగారు అనేక పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీలను పొందిన వజ్ఞావంతురాలు, విద్యాదేవి. మనోవిజ్ఞానశాస్త్రాన్ని అభ్యసించిన సృజనాత్మకతను కలిగిన సృజనాదేవి గారు ‘కనుల భాష తెల్సినా-మనోస్పందన అందించలేని భేషజం' అంటు మనోస్పందనలో వ్యక్తుల మధ్యనున్న అడ్డుగోడలు, అంతరాలు అపస్వర భావనలు వెరసి ఉద్వేగాలకు కారణభూతాలు అవుతాయని అందుకే వ్యక్తుల మధ్య స్నేహభావం సంయమనం అవసరమని తెల్పారు. ఎంసెట్ లక్ష్యసేతువును దాటే మహాయజ్ఞంలో సమిధవై... అంటూ నేటి సమాజంలో చదువు పరిస్థితి ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుల పందేరంలో కార్పోరేట్ కళాశాలలో వాడిన విద్యాకుసుమాలను తలుచుకొని అదే ఆవేదనను అక్షరాలుగా రాల్చినారు. అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలయని పెంచిన చేతులు మమకారం తీపిదనంతో పిల్లవాడు పెరిగి దూరమైనపుడు కడుపుకోతను నా గర్వానికి అశనిపాతంలా తగిలిన వేటుయని వినమ్రంగా తెల్పారు.