YEDATHEGANI PRAYANAM by YAKOOB Telugu book cover

YEDATHEGANI PRAYANAM

by YAKOOB

₹60
In stock · 4 available
PublisherMADHYAMAM PUBLICATIONS
LanguageTelugu
ముందు మా ట "Burning, he walks in the stream of flickering letters, clarinets Machines throbbing quicker, than the Heart, Copped-off heads, Silk canvases, and he stops under the sky. And raises toward it his Joined Clenched fists" Czeslaw Milosz (Italian Poet) బహుశా చాలా రోజుల్నించి, కొన్ని నెలల నుంచి నేను యాకూబ్ లోకంలోనే బతుకుతున్నా. ప్రతి కవికీ వాడిదయిన ప్రపంచం ఉంది, అనుభవం వుంది. అందరిచుట్టూ అదే ప్రపంచం వున్నా, ఆ కవి అందుకున్న అనుభవం అతనికే ప్రత్యేకమయింది.; ఈ ప్రపంచాన్ని ఆ కవి ఎలా దర్శించాడు, ఘర్షించాడు, ఆనందించాడు, దుఃఖపడ్డాడు, తనదయిన అనుభవ ప్రపంచాన్ని ఎలా సృజించుకున్నాడు! బహుశ అతని ఆశలు, ఆవేదనలు, ఉద్వేగాలు, సర్దుబాటులు, సమన్వయాలు; తనకొత్తగా కనుగొన్న సత్యం తాలూకు వెలుగు. ఏమి ప్రపంచమది, మనకందుబాటులో వున్న ప్రపంచాన్ని అతనెలా అనువదించాడు; ఎప్పుడూ సుఖంగా వున్నట్టు, లేనట్టూ, రక్తాలోడు తున్నట్టు, అనంతమయిన పూదోటల్లో తిరుగుతున్నట్టు, అడవికడ్డంబడి నడుస్తున్నట్టు, అకస్మాత్తుగా వాగు వెల్లువెత్తినట్టు, దరులు విరిగి పడుతున్నట్టు, జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నట్టు -- ఎప్పుడూ ఒక ఎదురుచూపు, ఒక ఆరాటం, ఒక ఆప్యాయతకోసం అర్రులు చాచటం, ఒక చల్లని స్పర్శ కోసం తపించటం, సుదీర్ఘమయిన రాత్రుల్ని కాయితాలుగా మలుచుకోవడం- బర్రెల్నో, గొర్రెల్నో కాయటం, ఏటిఒడ్డున నడుస్తూ రేగ్గాయల్నో, మరే పిచ్చికాయలో శబరి కొరికినట్టు కొరకటం, నెత్తురులోడే కాళ్ళతో నడవటం దాహంతో తపించటం అదంతా ఒక యాత్ర; యులెసిస్ యాత్ర; అదొక ప్రవాహం, ప్రవహించే జ్ఞాపకం!