
YEDI NEETHI YEDI REETHI
₹125
In stock · 6 available
PublisherNARISETTI INNAIAH
LanguageTelugu
ఒక చిన్నమాట అబద్ధాల వేట - నిజాలబాట గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ మెగసేసె అవార్డు గ్రహీత శ్రీమతి శాంతా సిన్హా ఈ పుస్తకం చిరస్తాయిగా మానవవాదుల హ్యాండ్ బుక్ గా మిగిలిపోతుందని అన్నారు. వేసిన వెయ్యి కాపీలు వెంటనే అమ్ముడయిపోయాయి. తర్వాత చాలామంది మిత్రులు, పుస్తక విక్రేతలు మళ్ళీ రీప్రింటు వేయమని అడిగారు. ఈ ప్రయత్నం జరుగుతుండగా మిసిమి ప్రచురణలు వారు, వారి పత్రికలో వచ్చిన వ్యాసాలు పుస్తకంగా వేస్తామని ముందుకొచ్చి ప్రచురించారు. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ పుస్తకం. ఇందులో హేతువాది మాసపత్రికలో ప్రచురితమైన వ్యాసాలు అంతకుముందు అబద్ధాల వేటలో ప్రచురితమయినవి, ఆ తర్వాత వచ్చినవి వున్నాయి. ఇన్నయ్యగారి కలానికి కాలపరిమితి లేదు. అందుకే ఈ వ్యాసాలు నాటి నుంచి ఈ నాటి దాకా మానవవాద విషయాల్ని, విశేషాల్ని, విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. ఏది నీతి? ఏది రీతి? అనే ఈ పుస్తకంలో నాగరీకుడయిన మనిషి ఆచరించాల్సిన జీవన విధానం వుంది. నమ్మాల్సినవి ఏమిటో, విడనాడాల్సినవి ఏమిటో హేతుబద్ధంగా వివరించారు రచయిత. ఈ వ్యాసం పరాన్నభుక్కులయిన ఒక సెక్షన్ ని ఇబ్బంది పెడతాయి. వారిబారిన పడిన అమాయక ప్రజల్ని ఇవి రక్షిస్తాయి. ఇలాంటి రచనలు ఈ సమాజానికి అవసరం. ఆహ్వానిద్దాం మనస్ఫూర్తిగా. ఈ వ్యాసాలు పుస్తకంగా రూపొందడంలో పాలుపంచుకున్న దామరాజు నాగలక్ష్మి, రామలక్ష్మి, చిట్టిబాబు, గోపీనాథరెడ్డిగార్లకు ధన్యవాదాలు. ఈ వ్యాసాలను హేతువాది మాసపత్రికలో ప్రచురించి ఈ రోజున ప్రత్యేక పుస్తకంగా తీసుకువచ్చే అవకాశం కలిగించిన రావిపూడి వెంకటాద్రిగారికి నా కృతజ్ఞతలు.