YEDI TELUGU EVARU TELUGUVARU by VASIREDDY BHASKARA RAO book cover

YEDI TELUGU EVARU TELUGUVARU

by VASIREDDY BHASKARA RAO

₹40
In stock · 22 available
PublisherVASIREDDY BHASKARA RAO
LanguageTelugu
1. ఏది తెలుగు ? ఎవరు తెలుగువారు మాతృభాషను, మాతృభూమిని అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కాని మాతృభూమిని విదేశీ దండయాత్రల నుండి కాపాడుకోలేని జాతి మాతృభాషను కూడా కాపాడుకోలేదు. విదేశీయుల ప్రత్యక్ష, పరోక్ష పాలన, వారి భాష, సంస్కృతి, సాహిత్యం, ఓడిపోయిన జాతిమీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఇంతకుముందు చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు ప్రపంచీకరణలో జరుగుతున్నది అదే. ఈ చారిత్రిక శక్తులను, బలహీనతలను గమనించకుండా ఒకానొక భాష అంతరించిపోతుంది. లేక కొన్ని వందల, వేల భాషలు కనుమరుగైపోయే ప్రమాదముందని భాషా ప్రియులు వాపోవడం అవివేకం. చారిత్రక పరిణామంలో యిదొక భాగంగా గుర్తించాలి. లేక విదేశీయుల ఆక్రమణలను అడ్డుకొనే దమ్ము, ధైర్యం ప్రతి జాతికి లేకుండా పోయిన దశలో శత్రువు ఎవరో గమనించకుండా, గుర్తించినా ఎదురించలేకపోవటం, ఎదుర్కొన్నా గెలవలేకపోవటం, జాతి యావత్తు రాజీ జాతి అయినట్లయితే, వారి మాతృభాషను కుదువబెట్టి, పరజాతీయుల భాషకు ముచ్చటపడితే, అందరూ పర రాజ్యానికి దాసోహమని దుబాషీలయితే యింకా మాతృభాష, మాతృభూమి ఎక్కడుంటుంది? తల్లిదండ్రులను, చెల్లిని, ఆలిని వదలి యితర దేశాలకు వలసపోయే వారికి, బతుకుదెరువు కొరకు తన భాషని, తననే వదలుకొని పోవుచున్న పరిస్థితిలో మాతృభాష ప్రాధాన్యం అడుగుకుపోతుంది. ఒక మనిషిని - యింకొక మనిషి, బలవంతుడు బలహీనుణ్ణి, తెలివిగలవాడు - తెలివి తక్కువవానిని లొంగతీసుకున్నంత కాలం ఈనాడు జరుగుచున్నది జరగక మానదు. యాత్ర, దండయాత్ర, యింకా ఎక్కువవుతున్న కొద్దీ భాషా సంకరణం, జాతి సంకరణం, దేశ ఎల్లలు మాసిపోవటం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ చారిత్రాత్మకమైనది. దీనిని అడ్డుకొనే, ఆపగలిగే శక్తి జీవరాశికి లేదు.