YEDU LADDULU - 60 by M.MADAN MOHANA RAO Telugu book cover

YEDU LADDULU - 60

by M.MADAN MOHANA RAO

₹60
In stock · 640 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. మేలెంచిన వారికి కీడెంచితే! తూర్పు ఐరోపా జానపద గాథ అనగనగా ఒక జాలరి. బాగా వృద్ధుడయ్యాడు. అందువల్ల సముద్రం మీదికి వెళ్ళి చేపలు పట్టే శక్తి లేక నదిలో పట్టసాగాడు. ప్రతిరోజూ పొద్దున్నే నదికి వెళ్ళి రోజంతా చేపలు పట్టుకుంటూ అక్కడే ఉండేవాడు. సాయంత్రం అయ్యాక ఆ రోజు తాను పట్టుకున్న చేపలు అమ్మి, ఆహార పదార్థాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళేవాడు. ఆ వృద్ధునికి నిజంగానే అది కష్టకాలం. ఒక వేసవికాలం మధ్యాహ్నం ఎండకు వగర్చుతూ, తన దురదృష్టానికి తనను తానే నిందించుకుంటూ కూర్చుని ఉండగా, ఒక వెండిలా తళతళ మెరుస్తున్న ఈకలు గల పెద్ద పక్షి వచ్చి అతనికి దగ్గరలో ఒక రాయి మీద వాలింది. అది 'కహ' అనే దివ్య పక్షి. 'తాతా, నిన్ను చూసుకోవటానికి ఎవరూ లేరా?' అని అడిగిందా పక్షి. 'ఒక్కరు కూడా లేరు'. 'ఈ వయసులో నువ్వంత కష్టపడాల్సింది కాదు. ఈ రోజు నించి ప్రతిరోజు సాయంత్రం నీకొక పెద్ద చేపను తెచ్చిస్తా. దాన్ని అమ్ముకుని వచ్చిన డబ్బుతో సుఖంగా జీవించు' అంది పక్షి. అన్నట్టుగానే ఆ పక్షి ప్రతిరోజు సాయంత్రం ఆ వృద్ధుని ఇంటి ముంగిట ఒక పెద్ద చేపను జారవిడిచేది. ఆ వృద్ధుడు చేయాల్సిందల్లా దాన్ని సంతకు తీసుకెళ్ళి అమ్ముకోవటం. పెద్ద చేపలకు బాగా గిరాకీ ఉండడంతో త్వరలోనే అతని దగ్గర బాగా డబ్బు పోగుపడింది. అతను సముద్రం ఒడ్డునే ఒక కుటీరాన్ని, దాని చుట్టూ ఉన్న తోటతో సహా కొని, తనకు వంటచేసి పెట్టడానికి ఒక సేవకుణ్ణి నియమించుకున్నాడు. అతని భార్య కొద్ది సంవత్సరాల క్రితమే చనిపోయింది. అందుకని మళ్ళీ పెళ్ళి చేసుకుందామని తగిన స్త్రీ కోసం వెతుకసాగాడు.