YEDURULENI MANISHI by DR.NANDAMURI LAKSHMI PARVATHI Telugu book cover

YEDURULENI MANISHI

by DR.NANDAMURI LAKSHMI PARVATHI

₹300
In stock · 22 available
PublisherUNNAM BROTHERS PUBLICATIONS
LanguageTelugu
ఆయనతో కొద్ది క్షణాలు చరిత్ర సృష్టించిన ప్రతి వ్యక్తిలో విశేషంగా కనిపించేది అతని . వ్యక్తిత్వమే. ఆటుపోట్లు వచ్చినా చెదరక ముందుకు సాగిపోయే వారే ధీరచిత్తులు. వారి సిద్ధాంతాల అమలుకు జీవితాలు కూలిపోయినా అడుగుకూడా వెనక్కు నడవరు. బుద్ధుడు మొదలుకొని గాంధీ వరకు వారివారి పోరాటాల్లో ఎదుర్కొన్న కష్టాలే ఎక్కువ. సిద్ధాంతమనేది సమాజానికి బ్రతికుండగా నచ్చని అంశం. అదేవారు చనిపోయాక విగ్రహాలు పెడతారు. ప్రతి మనిషి పుట్టగానే నోట్లో బంగారు చెంచాతో పుట్టరు. కష్టాలు, కన్నీళ్ళు కలబోసుకుని, జీవితసారాన్ని ఒడబోసుకుని, వడిదుడుకుల ప్రవాహంలో ఎదురీది ఒక సుస్థిరస్థానాన్ని సంపాదించే వాళ్ళే మహనీయులు. వాళ్ళ ఆశయాల బాటలో వ్యతిరేక శక్తులు కలిగించే అడ్డంకులెన్నో. అటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నివాసం ఏర్పరచుకున్న ధన్యజీవి డా. యన్టీరామారావు. యన్టీఆర్ నిజంగా చరిత్ర పురుషుడే. ఒక పురుషుడి జీవితంలో ఎన్ని ఆరోహణసోపానాలుంటాయో అవన్నీ అధివసించిన విశిష్టవ్యక్తి. గుణాలతో పాటు కొన్ని లోపాలు వుంటాయి. వాటి పాళ్ళను బట్టే మంచి, చెడులు నిర్ణయించబడతాయి. తరంగం ఎంత ఎత్తుకు లేచినా మళ్ళీ తన స్థానాన్ని గుర్తు పెట్టుకున్నట్లు, ఉన్నతస్థాయినంది కూడా గత జీవితాన్ని మర్చిపోని గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఆయనలాంటి వాళ్ళు పుట్టటమే అరుదు. రూపం, గుణం కలబోసుకుని, గొప్పగా ఎదిగి కన్న వూరికే కాదు తన రాష్ట్రానికి, దేశానికి కీర్తిని తెచ్చిన మహనీయుడు. కష్టాల్లో, కన్నీళ్ళల్లో గుండె దిటవు చూపి పోరాడి గెలిచిన వీరుడు. రైతు బిడ్డగా పుట్టి, వున్న ఆస్తులు పోగొట్టుకుని, కన్నవూరును విడచిపెట్టి విజయవాడలో తండ్రి చేసిన పాలవ్యాపారంలో తోడుగా నిలచిన ఉత్తమపుత్రుడు.