
YEKAPATRALU - AIDU YEKA PATRALU RENDAVA BHAGAM
₹20
In stock · 10 available
PublisherALLADA NARAYANARAO
LanguageTelugu
ముందు మాట 2006 వ సం॥న నేను 'ఏకపాత్రల, నాటికల సంపుటము' అనే గ్రంధము ముద్రించాను. గురువర్యులు, కవి, పండితులు, కీర్తి శేషులయిన శ్రీ పురాణం కుమార రాఘవ శాస్త్రి గారు రచించిన 'ఏకలవ్య' ఏకపాత్ర చాల కాలము క్రితము తిరువూరులో ప్రదర్శించబడింది. వారి రచన అయిన ఆ అంశమును కూడ ఆ గ్రంథమున కలిపి ముద్రించాలని ఎంతగానో ప్రయత్నించాను కాని వారి సంతానము వద్ద గాని, దానిని ప్రదర్శించిన వారి వద్ద గాని, దాని ప్రతి నాకు లభించలేదు. వారియందభిమానముతో చివరకు నేనే పూనుకుని, వారానాడు తమ రచనయందు ప్రకటించిన భావాలను జ్ఞప్తికి తెచ్చుకొని వ్రాయటానికి సాహసించాను. అలావారు వ్రాసిన 'ఏకలవ్య' ఏకపాత్రను ఈ సంపుటములో కలిపాను. కాకపోయినచో శైలిలో వైవిధ్యము ఉండవచ్చును. ఇంతకు ముందు నేను ముద్రించిన 'ఏకపాత్రల నాటికల సంపుటము' ప్రతిని రంగస్థల కళాకారులు శ్రీ బైరోజు దామోదరాచార్యస్థపతి, (వీవనగండ్ల, మహబూబ్నగర్ జిల్లా) గారికి పంపాను. దాని నందుకొని ఆయన గారు తమకు 'సర్దార్ భగత్ సింగ్', 'వీర శివాజీ' ఏకపాత్రలు వ్రాసి పంపమన్నారు. వారిభిమతానుసారం ఆ రెంటిని వ్రాసి వాటి వ్రాత ప్రతులను పంపాను. కాని నేను పంపిన సమయానికి వారు స్వర్గస్థులయినట్లు విషాద వార్త తెలియవచ్చింది. జనన మరణాలకెవరు అతీతులు కాకపోయినను. వారి ఆశయము ప్రకారము 2 ఏకపాత్రలు రంగ స్థలానికి లభించాయి. మిగిలిన రెండు ఏకపాత్రలు ('భక్తశబరి, భారతమాత') అన్నవి నా అభిరుచి ప్రకారం వ్రాసినవి. వీనిని రచించు సందర్భమున చక్కని సలహాల నిచ్చి, వానికి సమగ్ర స్వరూపము కల్గుటకు నాకెంతగానో తోడ్పడిన రంగ స్థల కళాకారులు శ్రీ బండి బసవయ్య (వాముకుంట్ల తిరువూరు మండలము), రచయితయు, న్యాయవాదియునైన శ్రీ సువారపు రామచంద్రరావు (తిరువూరు), కీ॥శే॥ శ్రీ రాళ్ళబండి అప్పలరాజు (రిటైర్డ్ తెలుగు లెక్చరర్, తిరువూరు) గార్లకు నా కృతజ్ఞతా పూర్వక వందనములు. నాటకరంగమునకు నేను చేసిన సేవ సఫలమగుటకు రంగస్థల కళాకారులు వీనిని సద్వినియోగమొనర్చుకొని, తమ వంతు సాయ మందించగలరని ఆశిస్తున్నాను.