
YELLALU DAATINA TELUGU MALLELU BURMA ANDHRULU
₹30
In stock · 27 available
PublisherSADHANA PUBLICATIONS
LanguageTelugu
ఒకనాడు... "విదేశాల్లో తెలుగు సంస్కృతి" అనే శీర్షికనిస్తూ "తెలుగు విశ్వ విద్యా లయం" (హైద్రాబాదు) నుండి గ్రంధ రచనలకుగాను ఒక ఆహ్వానం అందింది. 'కాందిశీకుని'గా నేను ఆంధ్రదేశం వచ్చేటప్పుడు రంగూన్ నుండి తీసుకు వచ్చిన “ఆంధ్రమిత్ర”, “తెలుగుబిడ్డ" పత్రికలు; మలేషియా "విదేశాంధ్ర" సాహిత్య పత్రికలు - పుట్టి పెరిగిన రంగూన్ జీవితం - అక్కడి తెలుగువారి నా యీ రచనకు శ్రీకారం జీవన గమనం చుట్టించాయి. మహోజ్వల కళావైభవం భవ్యమైన – దివ్యమైన - అపూర్వమైన చరిత్ర గలిగినవారు బర్మా ఆంధులు. నాయకుల 28 ఏళ్ళ "ఆంధ్రపత్రిక”లో “జర్నలిజం” అనుభవంలో - అనేకమంది భాషాకోవిదులతో చర్చించి - మరి అనేకమంది కాందిశీకులతోనూ తోనూ - బర్మా రచయితలతోనూ ఇంటర్వ్యూలు జరిపి - యీ గ్రంధ రచనను పూ ర్తి చేశాను. ఇలాంటి పుస్తకాలకు పెద్దలు - ప్రముఖులు - పరిచయాలు - పీఠికలు రాస్తారు. కాని... తెలుగు విశ్వవిద్యాలయం - ప్రత్యేక కమిటీ యీ పుస్తకాన్ని పరిశీలించి 5 వేల రూపాయలు అవార్డు పురస్కారం" ప్రకటించటమే యీ గ్రంథానికొక “ప్రత్యేకత"గా భావిస్తున్నాను. "స్పెషల్ సెలెక్షన్ కమిటి”కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా - తెలుగు విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత -బర్మా ఆంధ్రుల ప్రీతిపాత్రులు - డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారికి శతాధిక వందన సుమచందనాలు అర్పించుకుంటున్నాను.