YENIMIDI SHATABDALA RAMAPPA by JAYADHIR THIRUMAL RAO Telugu book cover

YENIMIDI SHATABDALA RAMAPPA

by JAYADHIR THIRUMAL RAO

₹90
In stock · 5 available
PublisherSPRUHA SAHITHEE SAMSTA
LanguageTelugu
ముందు మాట మన సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనాలుగా మనకు ప్రస్ఫుటంగా కనిపించేవి వాస్తు-శిల్పాలు. ఈ వాస్తు-శిల్పాలు తెలుగు దేశంలో ఉచ్ఛస్థితిని పొందింది కాకతీయ రాజుల కాలంలో. వారు కట్టించిన వందల దేవాలయాల్లో నేటికీ నిలిచి ఉన్న అత్యంత సుందర దేవాలయ సముదాయం వరంగల్లు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ పరిసరాల్లో ఉంది. ప్రధాన ఆలయాన్ని 'రామప్ప గుడి' అని స్థానిక ప్రజలు, 'రామలింగేశ్వరాలయం' అని పండితులు పిలుస్తున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న శిలా శాసనంలో పేర్కొన్న 'రుద్రేశ్వరాలయం' అనే పేరు మాత్రం ప్రజల నాలుకపై నిలువలేదు. రేచర్ల రుద్రుడు అనే కాకతీయ సామంత రాజు ఆ ఆలయాన్ని తన పేర కట్టించినా ఆ పేరు ప్రజల్లో ప్రచారానికి నోచుకోలేదు. కారణం, అతడు కట్టించిన గుడి స్థానంలో అంతకు ముందు రామప్ప గుడి, దానికి ముందు రామలింగేశ్వరాలయం ఉండేవి. و తెలుగు దేశాన్ని... ప్రత్యేకించి తెలంగాణను క్రీ.శ. 4 నుండి 6 శతాబ్దాల మధ్య పాలించిన విష్ణుకుండి రాజులు శైవ వైష్ణవ మతాల సమ్మేళనంగా రామలింగేశ్వరాల యాలను కట్టించారు. అలా వారే పాలంపేటలో ప్రస్తుతమున్న ప్రధాన దేవాలయం స్థానంలో మొట్టమొదట రామలింగేశ్వరాలయాన్ని కట్టించారు. ఇందుకు నిదర్శనంగా వారి కాలపు కోట శిథిలాలను, వారి లాంఛనమైన పూర్ణ కుంభ శిల్పాన్ని రామప్ప చెరువుకు ఈశాన్యంలో ఉన్న వరహాల గుట్ట పైన చూడవచ్చు..