YENNALLEE MOUNAM by SIVALA PADMA Telugu book cover

YENNALLEE MOUNAM

by SIVALA PADMA

₹80
In stock · 13 available
PublisherJATHIYA SAHITYA PARISHAT
LanguageTelugu
కథలు వ్రాయగోరేవారిలో ఉండవలసిన మౌలికగుణాలు, అర్హతలూ ఏవి? లోకంలోని చేదునిజాల్ని చెప్పగల ధైర్యం ఉండాలి. ప్రజలు పడుతున్న బాధలను ఆర్చాలన్న ఆరాటం ఉండాలి. ఈ సమాజం నేడు కాకుంటే రేపైనా మారుతుందనే ఆశాభావం ఉండాలి. మార్పు రావలసింది ఎవరిలోనోకాదు, మనలోనే అని నచ్చచెప్పే ఓర్పు ఉండాలి. క్రమంగా రూపుదిద్దుకొంటున్న మార్పును గమనిస్తూ, దానికి ప్రోత్సాహమిచ్చే ఓరిమీ ఉండాలి. ఈ విధమైన నిర్మాణాత్మక దృక్పథంతో ప్రయోజనాత్మక మైన కథలను అందిస్తున్న రచయిత్రి శ్రీమతి ముక్కవిల్లి (శివల)పద్మ. ఎం.ఏ. (ఫిలాసఫీ) ఎం.ఏ. (తెలుగు) విద్యార్హతలు చేతిలో ఉన్నా గృహలక్ష్మిగా ఉండటంలో ఆనందాన్ని ఆస్వాదిస్తున్న శ్రీమతి పద్మ నేటి మన కథకులలో విలక్షణతకు ప్రతిరూపం. 'చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోకు, చిరుదీపం వెలిగించు' అంటూ ఎందరో చెపుతూ ఉన్నా, చిరుదీపం వెలిగించే ఆరాటంతో సుదూరంలో ఉన్న అటవీ ప్రాంతాలలోకి వెళ్ళివస్తూ, వనవాసుల జీవితాలలో వెలుగులు నింపే కార్యకర్తి శ్రీమతి పద్మ. 'వనవాణి' మాసపత్రిక సంపాదకురాలిగా సమాజసేవను, సారస్వతసేవనూ సమన్వయం చేస్తున్న శ్రీమతి పద్మ మైత్రేయ, విజేత అనే ఇద్దరు పిల్లల తల్లి. కథలంటే కబుర్లు చెప్పటం కాదు, కబుర్లు చెప్పడానికి భిన్నమైనవీ కావు. కబుర్లుగా తోచినా, గంభీరమైన గాథలుగా కనిపించినా కనువిప్పు కల్గించటమే వాటికి సార్థకత. ఈ సార్థకత రహస్యం తెలిసి సాధన చేస్తున్న రచయిత్రి శ్రీమతి పద్మ. చదివినవారి సమయం సార్థకమౌతుంది, జీవితం సార్థకమౌతుంది ఇదీ మా విశ్వాసం. ఇదే సమయంలో విడుదల అవుతున్న మరో కథల సంపుటి 'ఫలించిన స్వప్నం'