YENNO JANMALU YENDARO MASTERS by DR.BRIAN WEISS Telugu book cover

YENNO JANMALU YENDARO MASTERS

by DR.BRIAN WEISS

₹100
In stock · 1 available
PublisherP.G.RAMMOHAN
LanguageTelugu
ముందుమాట ప్రతి సంఘటన వెనుకా ఒక బలీయమైన కారణం ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. కానీ, ఓ సంఘటన జరిగే వరకూ దానికి దారి తీసిన పరిస్థితుల్ని కానీ, కారణాలను కానీ గ్రహించే అంతర్ దృష్టి లేదా దూరదృష్టి మనకు రాదు. కానీ, యుక్త సమయంలో ఓపికతో మనం ఉంటే ఆ సంఘటన తప్పకుండా వెలుగులోకి వస్తుంది. కేథొరిన్ విషయానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇరవై ఏడేళ్ళ ప్రాయంలో ఉన్న ఆమెను 1980 వ సంవత్సరంలో నేను కలవడం తటస్థించింది. ఉదృతమైన ఆతురత, భీతి గొలిపించే భయావహ దృశ్యాల పరంపరతో మానసిక అదుపాజ్ఞలను కోల్పోయి ఒక పేషెంట్గా నా సహాయాన్ని కోరి వచ్చింది. కేథొరీన్. ఈ లక్షణాలు అన్నీ కాథరీన్ బాల్య దశ నుండే ఆమెను కలవర పెడుతున్నా, ఈ మధ్య కొంతకాలంగా తన మానసిక పరిస్థితి మరీ దిగజారింది. దుర్భరమైన భావోద్వేగాల వలన తన దైనందిన కార్యక్రమాలను కూడా సరిగ్గా నెరవేర్చలేక విపరీతంగా భీతిల్లి క్రుంగిపోయింది. ఎంతో గందరగోళ పరిస్థితులలో కేథారీన్ బ్రతుకును వెళ్ళ దీస్తున్న సమయంలో నా జీవిత నౌక సాఫీగా సాగిపోతూ ఉండేది. వివాహమై, ఇద్దరు పిల్లల తండ్రిగా దినదినావృద్ధి చెందుతున్న వృత్తిలో ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉండేవాణ్ణి. నా జీవన నౌక తొలి నాళ్ళ నుండీ కూడా సాఫీగానే సాగిపోతూ ఉండేది. ఆనందకరమైన, అప్యాయభరిత గృహ వాతావరణంలో పుట్టి పెరిగిన నాకు సహజంగానే అత్యున్నత చదువులు అబ్బాయి. కాగా, కాలేజీ విద్య నభ్యసించే రోజులలో నేను ఎదుర్కొన్న పరిస్థితులు, మనుష్యుల ప్రవర్తనా ప్రభావాలు నన్ను మానసిక వైద్య శాస్త్ర రంగాన్ని ఎంచుకునేలా చేశాయి. న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ నుండి 1966వ సంవత్సరంలో పట్టభద్రుడినై పిదప 1970లో ఎమ్. డి డిగ్రీని యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి సాధించాను. న్యూయార్క్ యూనివర్సిటీ - బెల్లీవ్యూ మెడికల్ సెంటర్లో అంతర్భాగ సేవలందిస్తూనే మనస్తత్వ శాస్త్రాన్ని పూర్తి చేయడానికి 'యేల్' యూనివర్సిటీకి తిరిగి రావడం జరిగింది.