
YENNO RANGULA THELLA KIRANAM
by SIRIVENNELA SEETHARAMA SASTRY
₹60
In stock · 2 available
PublisherSIRIVENNELA CREATIONS
LanguageTelugu
మా మాట సిరివెన్నెల కలం నుండి జాలువారిన సాహితీ స్రవంతిని పుస్తక రూపంలో, ఆడియో కేసెట్ల రూపంలో మీకు చేరుస్తున్న మా ప్రయత్నంలో భాగంగా... ఇదిగో... ఈ కథా సంకలనాన్ని సంక్రాంతి కానుకగా మీ ముందుంచుతున్నాం. పువ్వు పుట్టగానే పరిమళించే చందంగా శాస్త్రిగారిలోని సృజనాత్మకత ఆయన పిన్న వయస్సులోనే సంపూర్ణంగా వికసించి, సాహితీ సౌరభాలను వెదజల్లింది. ఆయన 7వ తరగతిలో ఉండగానే చందమామ పత్రికకు కథను, తరువాత భేతాళ కథను వ్రాసారు. తన 16వ ఏటనే "నా ఉఛ్వాసం కవనం" అని సవినయంగా తెలుపుతూనే "నేను శాసిస్తాను కవితని" అంటూ సగర్వంగా ప్రకటించారు. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో కవితలు, కథలు, గీతాలు, నాటికలు... ఇలా అన్ని సాహితీ ప్రక్రియలకూ తనదైన అనితరసాధ్యమైన బాటీలో నూతనత్వాన్ని పొదుగుతూ సాగిపోతున్నారు. సినీరంగ ప్రవేశానికి దాదాపు ఒకటిన్నర దశాబ్దం ముందు నుంచే ఆయన కథలు, కవితలు వివిధ వార, పక్ష, మాస పత్రికలలో "భరణి" కలం పేరుతో ప్రచురించబడటం ఆరంభం అయింది. ఒక రచయిత లేక కవి యొక్క శక్తి ప్రముఖంగా రెండు రూపాల్లో వ్యక్తమవుతుంది. భావుకత ఒకటైతే, భావ వ్యక్తీకరణ రెండవది. శాస్త్రిగారి రచనలలో ఈ రెండు అంశాలు కూడా అత్యుత్తమ స్థాయిలో ఉండటమే కాక, ఆ పైన సునిశిత పరిశీలన మరియు అనుపమానమైన తాత్త్వికత కూడా మనకి స్పష్టంగా సాక్షాత్కరిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని ఒక చిత్త కోణంలో పరిశీలించటం, ఆ దృక్కోణం వెల్లడి చేసే సత్యాన్ని ఆవిష్కరింపచేయడం, తద్వారా పాఠకలోకాన్ని ఆలోచింపజేయడం ఆయన సాహిత్యపు ట్రేడ్మార్క్ ! ఆలోచనామృతం సాహిత్యం.