
YERRADABBA RAILU
₹60
In stock · 22 available
PublisherSEELA VEERRAJU
LanguageTelugu
విస్తరించు మిత్రమా! నిన్ను త్యాగాలు చేయమనడం లేదు భోగాలుమాత్రం వొద్దంటున్నాను ఇల్లు సరిదిద్దుకోలేనివాడు ఊరినేం ఉద్దరిస్తాడని చెప్పకు. అది స్వార్థానికి తొడిగే అందమైన మేలి ముసుగు ఇల్లు సరిదిద్దుకోవడం అంటే నీ సర్వశక్తులూ ఇంటికోసమే ఖర్చుచేయడం కాదు. నువ్వు గొడ్డులా చాకిరీ చేసి నీ వాళ్ళని కష్టపడకుండా చేయడం కాదు నువ్వు బాధల ముళ్ళమీద నడుస్తూ నీ వాళ్ళని సుఖాల పల్లకీలో ఊరేగించటం కాదు నిన్ను నువ్వు తీర్చిదిద్దుకున్నట్టే వాళ్ళూ వాళ్ళని తీర్చిదిద్దుకోనివ్వు అందుకు ఆలోచనివ్వు, అవకాశమివ్వు అవసరమైతే చిన్న కుదుపిచ్చి కదుపు