
YERRAYYA KATHALU
₹35
In stock · 14 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
అనగనగా... ఎంచెక్కా కథల లోకంలో తిరుగాడుదాం రండి! ఊహల రెక్కలు తొడుక్కుని ఎక్కడెక్కడికో విహరించి వద్దాం. ఆనందాన్నిచ్చే లోకాన్ని ఓసారి చుట్టి వద్దాం. ఇపుడు మీకు కతలు చెప్పే తీరిక మీ అమ్మానాన్నలకు లేదనే చింత వద్దు. తాతయ్య, మామ్మలు లేకుండా పోయారనే బెంగ వదొద్దు. మీలాంటి వాళ్ళ కోసమే పాతతరం రచయితలు 'కథానిధి'ని తయారుచేసారు. భారత భాగవత రామాయణాల్లో ఎన్నెన్నో కథలు మీ కోసం కాచుకులేవు ? పాతబడ్డా ఇవింకా మనకి గుర్తుండిపోయాయంటే నమ్మండి. కథల్లోకి వెళ్లేముందు మీకో విషయం మనవిచేస్తా. సంస్కృతంలోని వ్యాసభారతాన్ని పదిహేను పర్వాలూ తెలుగు చేసిన తిక్కన మహాకవి పేరు మీరు వినే ఉంటారు. ఆ తిక్కనకు కేతన అనే శిష్యుడున్నాడు. కాలం 1215-1260. దశకుమారచరిత్ర అనే కథల సంపుటిని పద్యాల్లోరాసి తిక్కనకి అంకితమిచ్చాడు కేతన. తెలుగులో మొదటి కథా కావ్యం ఇదే. సంస్కృతంలో దండి అనే కవి రాసిందానికిది అనువాదం. మొత్తం పద్యాలతో, మధ్యమధ్య గద్యంతో పన్నెండు అధ్యాయాలు (ఆశ్వాసాలు) కలిగిన రచన 'దశకుమారచరిత్ర'. రాజవాహనుడు మొదలైన దశకుమారుల సాహసకార్యాలు గొప్పగా వర్ణించాడు కేతన. రాజవాహనుడు తాను యిష్టపడ్డ అవంతీ సుందరిని పెళ్ళాడటం దీన్లోని ప్రధానకథ. ఇది యిప్పటికి ఎనిమిదివందల ఏళ్ళనాటి మాట. ఆ తరవాత మూడొందల ఏళ్ళకి ఎర్రయ్య అనే గొప్ప రచయిత వచ్చాడు. కొక్కోకం అనే సంస్కృత గ్రంథాన్ని తెనిగించటంతోపాటు 'సకలనీతి కధావిధానం' అనే కథలు పుస్తకాన్ని రాసాడు. ఐదు అధ్యాయాల్లో అనేకానేక వినోద, హాస్య, నీతికధల్ని ఏర్చి కూర్చాడు ఎర్రయ్య. ఎర్రయ్య కథల్లో తప్పనిసరిగా కనిపించే శృంగారాన్ని తప్పించి అనేక మార్పుచేర్పులతో ఆ కథలు మీ ముందుంచుతున్నా. ఈ కథల్ని ఎర్రయ్య ఐదొందల ఏళ్ళనాడు రాసినప్పటికీ నేటికీ వన్నె తగ్గలేదు. ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. బెల్లంముక్కలా నోరూరిస్తాయి. చెరకు గడలా నోటిని తీపెక్కిస్తాయి. రసగుల్లాలా కరిగిపోతాయి. తాటిబెల్లంలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. పూతరేకులా నోటికి అంటుకుపోతాయి. ఇహ ఎర్రయ్య కథల్లోకి రయ్మంటూ పోదాం. -సశ్రీ పరిచయకర్త