YOGA - JEEVANASAILI - AHARAM - AROGYAM by M.MADHAVARAO Telugu book cover

YOGA - JEEVANASAILI - AHARAM - AROGYAM

by M.MADHAVARAO

₹120
In stock · 6 available
PublisherM.MADHAVARAO
LanguageTelugu
యోగ - ఆరోగ్యం యోగం శరణం గచ్చామి ఈ ఆధునిక యుగంలో మానవునికి విశ్రాంతి కరువైంది. సమయానికి తినలేడు. సమయానికి నిద్రపోలేడు. నిరంతరం ఆలోచనల సుడిగుండంలో చిక్కుకొని దీర్ఘకాల రోగిగా మారుతున్నాడు. నేటి జీవితంలో ఒత్తిడి, ఆతృత, ఆందోళన, భయం, అలసటలతో మానవుడు సతమతమౌతున్నాడు. వీటికి పరిష్కారం కోసం మత్తుమందులు, మధ్యం, సిగరెట్లు, గుట్కాలకు బానిసవుతున్నాడు. పై మానసిక రుగ్మతల మూలంగా శరీరంలోని ప్రతి అవయవం వ్యాధుల బారినపడి ఆనారోగ్యం పాలవుతున్నాడు. ఈ భూమిపై నివశిస్తున్న ప్రతిప్రాణి మనుగడకు అవసరమైన గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితమయ్యాయి. తద్వారా మానవుడు అనేక రోగాలతో శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. అనుభవించడానికి అన్నీ ఉండికూడా సంతోషంగా ఉండలేక పోతున్నాడు. జీవితంలో ఎదగడం ఎంత అవసరమో, ప్రశాంతంగా జీవించగలగడం కూడా అంతే అవసరం. ప్రస్తుత పోటీ పరిస్థితులలో మనుషులు ఆర్థికంగా ఎదుగుతున్నారు కానీ మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఈ కంప్యూటర్ యుగంలో లక్షలాది రూపాయల జీతంతో కోట్లు సంపాదిస్తున్నారు, కానీ పని ఒత్తిడితో బి.పి., షుగర్, గ్యాస్ ట్రబుల్, తలనొప్పిలాంటి సమస్యలతో అల్లాడుతూ, 40సం॥లకే ముసలి ప్రాయానికి దగ్గరౌతున్నారు. జీవితంలో పెరిగిన వేగం, పడిపోయిన విలువలు, దూరమౌతున్న బాంధవ్యాలు, హద్దులు మీరిన ఆశలు ఒత్తిడిని విపరీతంగా పెంచుతున్నాయి. శారీరక వ్యాయామం కరువై, కుర్చీకి అతుక్కుపోయి పని ఒత్తిడితో మానసికంగా క్రుంగిపోతున్నాడు. నిద్రకోసం నిద్రమాత్రలు, బలం కోసం టానిక్కులు, చూపుకోసం కళ్ళజోళ్ళు తప్పనిసరి అయినాయి. శ్రమ నీ ఆయుధం అయితే, విజయం నీ బానిసవుతుంది.